Rahul Gandhi in Assam: అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టవేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చేదు అనుభవం ఎదురైంది. ‘భారత్ జోడో న్యాయ యాత్ర' (Bharat Jodo Nyay Yatra)లో భాగంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. అయితే ఈ క్రమంలో సోమవారం నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించుకునేందుకు ఆయన కార్యకర్తలతో కలిసి వెళ్లగా టెంపుల్ కమిటీ అడ్డుకుంది.
రాహుల్ నిరసన..
అయితే దీనిపై నిరసన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అడ్డుకోవడానికి గల కారణమేంటని సిబ్బందిని ప్రశ్నించారు. గుడిలోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోడీ నిర్ణయిస్తున్నారని విమర్శలు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి నడి రోడ్డుపైనే బైఠాయించారు. ఆలయంలో గొడవలు సృష్టించడం తమ అభిమతం కాదని, కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్లిపోతామని చెప్పినా వినిపించుకోలేదని ఆయన ఆరోపించారు. అలాగే తనను లోపలికి అనుమతించ వద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతోనే ఆలయ కమిటీ అడ్డుకుందని విమర్శించారు. ‘మేము ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నాం. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేమీ చేశాను? మేం ఇక్కడకు ప్రార్థించడానికి వచ్చాము. ఎలాంటి సమస్యలు సృష్టించడానికి కాదు’ అని రాహుల్ అన్నారు.
ఇది కూడా చదవండి : PM Modi: ‘రాముడిని క్షమించమని వేడుకుంటున్నా’.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఒకసారి పునరాలోచించుకోవాలి..
ఇదిలావుంటే.. రాహుల్ యాత్ర మార్గంపై ఒకసారి పునరాలోచించుకోవాలని ఆదివారం రాహుల్‌ను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యం ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ అభ్యర్థన చేశారు. అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ. మేర జనవరి 25 వరకు రాహుల్ యాత్ర కొనసాగనుంది. ఇక 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సాధువు శ్రీమంట శంకరదేవ జన్మస్థలంలో నిర్మించిన ఆలయమే బటద్రవ. ఇది శ్రీమంత శంకరదేవ జన్మస్థలం.