Health: తులసి చేసి మేలు ఏంటో తెలిస్తే దాన్ని ఎందుకు పూజిస్తారో అర్థమవుతుంది

తులసి ఆకులు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇది బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

New Update
Health: తులసి చేసి మేలు ఏంటో తెలిస్తే దాన్ని ఎందుకు పూజిస్తారో అర్థమవుతుంది

తులసి మొక్కను పూజించే దేశం మనది. తులసి వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. శ్వాసకోశ ఆరోగ్యం నుంచి క్యాన్సర్ నిరోధక లక్షణాల వరకు తులసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తులసి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ: తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. శరీరంలో మంటను తగ్గించడంలో ఇది సహాయపడవచ్చు.

యాంటీఆక్సిడెంట్: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

రోగనిరోధక వ్యవస్థ: తులసి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తుంది.

తులసి ఆకులను తినడం వల్ల ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

శ్వాసకోశ ఆరోగ్యం: ఆస్తమా, బ్రోన్కైటిస్, జలుబు లాంటి శ్వాసకోశ పరిస్థితుల లక్షణాలను తగ్గించడానికి తులసిని ఉపయోగిస్తారు.

యాంటీమైక్రోబయల్ లక్షణాలు: తులసి యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

డయాబెటిస్: కొన్ని అధ్యయనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి.

గుండె ఆరోగ్యం: ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడుతుంది.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు: ఇది కచ్చితంగా చెప్పడానికి మరింత పరిశోధన అవసరం. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం తులసి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.

తులసి గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిస్తుంది. తులసిని ఎసిడిటీ, హార్ట్‌బర్న్‌ని తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తారు. జీర్ణ ప్రయోజనాల కోసం తులసిని చేర్చడానికి.. తాజా ఆకులను నమలడం ద్వారా లేదా సప్లిమెంట్ రూపంలో టీ లాంటి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. అయితే పైన చెప్పినవేమీ కూడా మెడిసన్‌కు రిప్లేస్‌మెంట్ కాదు. ఆయుర్వేదం వంటి సాంప్రదాయ వైద్య విధానాలలో శతాబ్దాలుగా తులసిని ఉపయోగిస్తున్నప్పటికీ.. ఇది వైద్య సలహా కాదని గుర్తుపెట్టుకోండి.

Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. RTV ఈ ఆర్టికల్‌ను ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: చలికాలంలో వచ్చే రోగాలను తరిమేయాలా..? అయితే ఇవి తినండి..!

Watch:

Advertisment
తాజా కథనాలు