Barrelakka: బర్రెలక్క మరోసారి టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్‌గా మారింది. తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. చిన్న వయసులోనే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎన్నికల బరిలో నిలిచి సంచలనం సృష్టించింది. తెలంగాణ ఎలెక్షన్స్ తర్వాత ఫుల్ ఫేమసైన ఇటీవలే తన పెళ్లి వార్తను ప్రకటించింది. మార్చి 28న వెంకటేష్ అనే అబ్బాయిని వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది.
తాజాగా తన ప్రీ వెడ్డింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది బర్రెలక్క. ‘ఓ శిరీషా.. నా శిరీషా..’ అంటూ తన కోసమే ప్రత్యేకంగా రాయించుకున్న పాటతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. అప్పట్లో ‘అనితా ఓ అనితా’ సాంగ్ తో యువతను ఓ ఊపు ఊపిన నాగరాజు ఈ పాటను పాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
స్ట్రైక్, క్లైమ్స్ వేస్తాను బర్రెలక్క వార్నింగ్
ఇది ఇలా ఉంటే.. తన ప్రీ వెడ్డింగ్ వీడియోకు సంబంధించి బర్రెలక్క చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తన ప్రీ వెడ్డింగ్ కోసం ప్రత్యేకంగా రాయించుకొని షూట్ చేయించుకున్న సాంగ్ ఇతర ఛానెల్స్ వాళ్ళు వాడుకుంటే స్ట్రైక్ వేస్తానని వార్నింగ్ ఇచ్చింది. గతంలో ఎన్నికల సమయంలో కూడా తనకు సంబంధించిన పాటలను ఇతర ఛానెల్స్ లో వేసుకున్నారని. కానీ అప్పుడు తాను ఏం పట్టించుకోలేదని. ఇప్పుడు మాత్రం అలా కాదని. తన ప్రీ వెడ్డింగ్ కోసం చేయించుకున్న పాటను ఎవరైన వాడితే స్ట్రైక్, క్లైమ్స్ వేస్తానని తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియోను రిలీజ్ చేసింది. అయితే ఏమైందో తెలియదు కానీ కొంత సమయం తర్వాత ఆ వీడియోను డిలీట్ చేసింది బర్రెలక్క.