ఓటమిపై స్పందించిన బర్రెలక్క.. మరో సంచలన నిర్ణయం సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క (శిరీష) తన ఓటమిపై స్పందించింది. ఈ పరాజయం తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది. ఎందుకంటే తనకు అనుకున్నదానికంటే ఎక్కువే ఓట్లు పడ్డాయని, అండగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపింది. చివరగా ఎంపీగా పోటీచేస్తానని ప్రకటించింది. By srinivas 03 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కొల్లాపూర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క (శిరీష) ఎన్నికల రిజల్ట్ పై స్పందించారు. ఈరోజు కౌంటింగ్ సెంటర్ కు తన సన్నిహితులు, మద్దతుదారులతో కలిసి వచ్చిన ఆమె పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముందంజ వేసింది. అయితే ఊహించని విధంగా ఈవీఎం ఓట్ల లెక్కింపునకు వచ్చేసరికి డీలాపడిపోయింది. మొదటి రౌండ్ లో 400 పైగా ఓట్లు వచ్చినప్పటికీ తర్వత రౌండ్లో వెనకబడి పోయింది. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం కేవలం 983 ఓట్లు మాత్రమే పొందింది. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. అయితే తన ఓటమిపై మీడియాతో మాట్లాడిన శిరీష ఈ ఓటమి తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదని చెప్పింది. 'ఈ ఎన్నికల్లో నాకు మద్ధతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. నేను అనుకున్నదానికంటే ఎక్కువే ఓట్లు వచ్చాయి. అందుకు నేను సంతోషంగా ఉన్నాను. మొదటి ప్రయత్నంలోనే ఇంతటి ఆదరణ నాకేంతో ధైర్యాన్నిచ్చింది. ఈ ఓటమి నన్ను పెద్దగా బాధించట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ నిరుద్యోగులంతా నావైపే ఉన్నారు. ఇందులో ఓడిపోయినంత మాత్రానా వెనకబడుగు వేయాలనుకోవట్లేదు. త్వరలోనే ఎంపీగా పోటీ చేస్తా. రాజకీయ అనుభవం లేకపోయినా తెలుసుకుంటూ ముందుకెళతా. ఇది నా తొలి అడుగే. అయినా ప్రజలు నాకు ఎంతో స్ఫూ్ర్తి కలిగించారు. నాపై దాడులు జరిగినా వెనకడుగు వేయకుండా మరింత శక్తితో అడుగులు వేస్తున్నా. ఇందులో గెలిస్తే నా దగ్గర పైసలు లేకపోయినా గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ తో అభివృద్ధి చేయాలని అనుకున్నా. నిరుద్యోగుల సమస్యలు, రోడ్లు, తదితర అంశాలపై నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది' అని తెలిపింది. Also read : సీఎం అభ్యర్థిపై కోమటిరెడ్డి, డీకే శివకుమార్ సంచలన ప్రకటన అలాగే సోషల్ మీడియా ద్వారా తనకు దేశ వ్యాప్తంగా లభించిన సపోర్టు ఎంతో ధైర్యాన్నించ్చిందని తెలిపింది. అయితే కొంతమంది తాను సోషల్ మీడియా హైప్ కోసం ఇలాంటి పనులు చేశానని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తనకు ఏమీ లేదు ప్రజలకు ఏమీ చేస్తుందని ఎగతాళి చేశారు. అయినా బాధపడలేదు. ఎందుకంటే ఒక్కరూపాయి ఇవ్వకుండా ఓట్లు వేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. చివరగా పుట్టగానే ఎవరూ నడవరని, భవిష్యత్తులోనూ తాను తప్పకుండా విజయం సాధిస్తానని తెలిపింది. ఇక ఇదిలావుంటే.. కొత్త గవర్నమెంట్ కూడా మంచి పనులు చేయాలి. నిరుద్యోగం, సమస్యలు పరిష్కారం దిశగా ఉండాలని కోరుతున్నాను. జేడీ లక్ష్మీనారాయణ, కంచె ఐలయ్య వంటి ప్రముఖులతోపాటు పౌర హక్కులు, మహిళా సంఘాల వాళ్లుకూడా సపోర్టుగా నిలిచినందుకు థాంక్స్ చెప్పింది. #telangana-elections-2023 #barrelakka #telangana-election-results #barrelakka-sirisha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి