Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్..ఈ వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్..!

బ్యాంకు వినియోగదారులకు ముఖ్యగమనిక. సెలవులు, వారాంతాలు సహా పలు కారణాలతో ఈ వారంలో ఐదురోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాత వారంలో కూడా బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులున్నాయో చూద్దాం.

New Update
Bank Holidays: జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!

బ్యాంకు వినియోగదారులకు ముఖ్యగమనిక. సెలవులు, వారాంతాలు సహా పలు కారణాలతో ఈ వారంలో ఐదురోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాత వారంలో కూడా బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు. ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులున్నాయో చూద్దాం.

దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అన్ని జాతీయ బ్యాంకులకు ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం గుడిపడ్వా, ఉగాది, ఏప్రిల్ 10 బుధవారం బోహాగ్ బిహు, ఈద్, ఏప్రిల్ 11వ తేదీ గురువారం రంజాన్ , ఏప్రిల్ 13వ తేదీ రెండవ శనివారం, ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం ఇలా ఈ ఐదురోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

ఇక ఏప్రిల్ 15, 16 తేదీలలో వరుసగా బోహాగ్ బిహు, శ్రీరామనవమి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. మరిన్ని వివరాల కోసం వినియోగదారులు సమీపంలోని బ్యాంకు శాఖలను సంప్రదించి తెలుసుకోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేస్తాయి.

ఇది కూడా చదవండి: మీరు బోట్ స్మార్ట్ వాచ్ వాడుతున్నారా? అయితే మీ డేటా మొత్తం గోవిందా..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు