Bank Employees Strike: డిసెంబర్ 4 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఆ 6 రోజులు బ్యాంకులు బంద్? డిసెంబర్ నెలలో దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. By Bhoomi 17 Nov 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఏవైనా బ్యాంకులు పనులు ఉంటే ఇప్పుడే పూర్తి చేసుకోండి. ఎందుకంటే డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా పలు బ్యాంకులు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఛాన్స్ ఉంది. డిసెంబర్ 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు లక్షల ఉద్యోగాలను భర్తి, బ్యాంకుల ఔట్ సోర్సింగ్ సిబ్బందికి స్వస్తి అనే ప్రధాన డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయి అసోసియేషన్ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికిసంబంధించిన పలు బ్యాంకులు సమ్మెకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ 4 నుంచి 11 వరకు బ్యాంకుల వారీగా సమ్మె కొనసాగనుంది. బ్యాంకుల్లో తగినంత శాశ్వత సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగాల అవుట్ సోర్సింగ్ వల్ల దిగువ స్థాయిలో రిక్రూట్ మెంట్ ను తగ్గించడమే కాకుండా కస్టమర్ల గోప్యత, వారి డబ్బు ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొనే బ్యాంకుల వివరాలను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. #BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/YkbNeE87kK — CH VENKATACHALAM (@ChVenkatachalam) November 14, 2023 డిసెంబర్ 4న SBI, PNB, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు సమ్మెకు దిగనున్నాయి. డిసెంబర్ 5న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిసెంబర్ 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అలాగే డిసెంబర్ 7న యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, డిసెబర్ 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, డిసెంబర్ 11న ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది కూడా చదవండి : సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా కాశీ టూర్.. ప్రతీ రైతుకు ఆవు.. బీజేపీ మేనిఫెస్టో ఇదే? #strike #demands #banks #bank-employess-association #bank-employees-strike మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి