BREAKING: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా రాజీనామా!

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఆమె అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారంటూ బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ ఛీఫ్ ప్రకటించినట్లు కథనాలు వస్తున్నాయి.

New Update
BREAKING: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా రాజీనామా!

Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఆమె అధికారిక ప్రకటన చేయనున్న కథనాలు వెలువడుతున్నాయి. ఆర్మీ ఛీఫ్ త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హసీనా ఢాకా నుంచి సోదరితో కలిసి హసినా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతున్నట్లు సమాచారం. కాగా షేక్ హసినా ఇండియాలో ఆశ్రయం పొందనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా బంగ్లాదేశ్‌ రిజర్వేషన్ల ఇష్యూతో అట్టుకుడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే క్రమంలో షేక్‌ హసినా రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులనుంచి డిమాండ్స్ పెరిగాయి. బంగ్లాదేశ్ అల్లర్లలో ఆదివారం ఒక్కరోజే 98 మంది చనిపోగా.. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 300 దాటినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఈ గొడవలకు దారితీయగా.. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30 శాతం రిజర్వేషన్ కోటాను 1972లో బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిని 2018లో అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. అయితే హైకోర్టు మళ్లీ 30 శాతం కోటాను పునరుద్ధరించడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. గత నెలలో హైకోర్టు తీర్పుపై స్టే విధించిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు.. కోటా చట్టవిరుద్దమని స్పష్టం చేసింది. వారసులకు 5 శాతం, ఇతర వర్గాలకు మరో 2 శాతం మాత్రమే రిజర్వ్ చేసింది. ఆందోళనలు ఆపేయాలని విద్యార్థులకు సూచించింది. అయితే ఆందోళనల్లో చనిపోయినవారికి న్యాయం చేయాలని కోరుతూ మరోసారి ఉద్యమం మొదలైంది.

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా జరిగిన గొడవల్లో దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. నార్సింగ్‌ ప్రాంతంలో అధికార అవామీలీగ్‌కు చెందిన ఆరుగురు నేతలను ఆందోళనకారులు కొట్టి చంపేసినట్లు తెలుస్తోంది. ఢాకాలో బంగబంధు షేక్‌ ముజీబ్‌ మెడికల్‌ వర్సిటీ వద్ద అనేక వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. పోలీసు ప్రధాన కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం 14 మంది పోలీసులు మరణించినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు