Asia Cup 2023: పాక్‌ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయిన బంగ్లా టీమ్

ఆసియా కప్‌లో సూపర్‌-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు చెతులేత్తేశారు. పాక్‌ బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన బంగ్లా టీమ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్‌ 38.4 ఓవర్లకు 193 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

New Update
Asia Cup 2023: పాక్‌ బౌలర్ల దాటికి తట్టుకోలేకపోయిన బంగ్లా టీమ్

ఆసియా కప్‌లో సూపర్‌-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు చెతులేత్తేశారు. పాక్‌ బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన బంగ్లా టీమ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్‌ 38.4 ఓవర్లకు 193 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫీకర్‌ రహీమ్‌ (65), షకీబ్ అల్ హసన్ (53) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్లే వెనుదిరిగారు. కాగా పాక్‌ బౌలర్లలో హరీస్ రవూఫ్‌ 4 వికెట్లతో సత్తా ఛాటగా.. నషీమ్‌ షా 3 వికెట్లు తీసుకున్నాడు. మరోవైపు అఫ్రీదీ, అష్రఫ్, అహ్మద్‌లకు తలో వికెట్‌ దక్కింది.

కాగా అంతకు ముందు అఫ్ఘనిస్థాప్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఓపెనర్‌ మెహిదీ హసన్ మిరాజ్ పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం డకౌట్‌ అయ్యాడు. మరోవైపు ఇటీవల భారత జట్టు పాక్‌తో ఆడిన మ్యాచ్‌ వర్షం వల్ల రద్దైంది. అనంతరం నేపాల్‌ తో జరిగిన మ్యాచ్‌కు సైతం వరుణుడు అనేక సార్లు అడ్డుపడ్డాడు. దీంతో భారత్‌ ఆడే వేదికలను మార్చాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ భావిస్తోంది. కాగా భారత టీమ్‌ సెప్టెంబర్ 10 కొలంబో వేదికగా మళ్లీ పాక్‌తొ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అక్కడి అధికారులు తెలిపారు.

మరోవైపు గాయం కారణంగా అసియా కప్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ శ్రీలంకకు వెళ్లాడు. ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న ఈ కీపర్‌.. కొలంబోలో ప్రాక్టీస్‌ చేస్తున్న టీమ్‌తొ కలిశాడు. కేఎల్‌ రాహుల్ జట్టులో చేరడంతో ఓపెనింగ్‌ జోడి మరింత బలపడే అవకాశం ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేఎల్‌ రాహుల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు