Bangladesh Crisis: భారత్ నుంచి వెళ్ళిపోయిన షేక్ హసీనా విమానం.. ఏమైందంటే..

బంగ్లాదేశ్ లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో భారత్ వచ్చిన ప్రధాని షేక్ హసీనా విమానం తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. అయితే, షేక్ హసీనా మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఆమె లండన్ లేదా ఫిన్లాండ్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Bangladesh Crisis: భారత్ నుంచి వెళ్ళిపోయిన షేక్ హసీనా విమానం.. ఏమైందంటే..

Bangladesh Crisis:  బంగ్లాదేశ్‌లో హింసాకాండ మధ్య భారత్‌కు చేరుకున్న షేక్ హసీనా సైనిక విమానం హిండన్ ఎయిర్‌బేస్ నుంచి మంగళవారం ఉదయం బయలుదేరింది. విమానం ఎక్కడికి వెళ్లిందన్న సమాచారం లేదు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా సోమవారం (ఆగస్టు 5) భారత్‌కు చేరుకున్నారు. ఒకరోజు తరువాత ఆమె విమానంలో భారత్ నుంచి వెళ్లిపోయారని మొదట వార్తలు వచ్చాయి. . ఆమె లండన్ లేదా ఫిన్లాండ్ వెళ్ళవచ్చని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  అయితే, ఆ విమానంలో షేక్ హసీనా లేరని.. ఆమె వెంట వచ్చిన బాంగ్లాదేశ్ మిలటరీ అధికారులు ఏడుగురు తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయారని ANI తెలిపింది. 

అసలేం జరిగింది.. 

Bangladesh Crisis:  హసీనాకు వ్యతిరేకంగా రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలో సోమవారం చాలా హింస జరిగింది. దీని తర్వాత హసీనా ఢాకా నుంచి అగర్తల మీదుగా భారత్‌కు చేరుకుంది. హిండన్ ఎయిర్‌బేస్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సుమారు గంటపాటు ఆమెతో మాట్లాడారు.

Bangladesh Crisis:  ఇక మరోవైపు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి మాట్లాడారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి అవుతారని భావిస్తున్నారు. 

బంగ్లాదేశ్‌లో అధికార మార్పునకు సంబంధించిన అప్ డేట్స్.. 

  • జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేత ఖలీదా జియాను విడుదల చేయాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఆదేశించారు. 2018లో అవినీతికి సంబంధించిన కేసులో ఆమెకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది.
  • ఆందోళనకారులు ప్రధాని నివాసంలోకి ప్రవేశించారు. విధ్వంసం, దహనానికి పాల్పడ్డారు.
  • రాజధాని ఢాకాలో 4 లక్షల మంది వీధుల్లోకి వచ్చి స్థలాలను ధ్వంసం చేశారు.
  • సోమవారం పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు చనిపోయారు. ఆందోళనకారులు 2 రహదారులను ఆక్రమించారు. ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే.
  • భారతదేశంలో, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర, అస్సాం, మిజోరాంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో BSF హెచ్చరికను పెంచింది.
  • దేశంలోని ప్రధాన పార్టీల నేతలతో బంగ్లాదేశ్ ఆర్మీ సమావేశం నిర్వహించింది. 18 మంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు.
  • బంగ్లాదేశ్ వెళ్లే రైళ్లన్నింటినీ భారత్ రద్దు చేసింది. ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా ఢాకాకు అన్ని విమానాలను రద్దు చేశాయి.
  • విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుని ఆయనకు ఒక సమాచారం అందించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా విదేశాంగ మంత్రిని కలిశారు.
  • ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బంగ్లా పరిణామాలను విదేశాంగ మంత్రి జై శంకర్ అఖిల పక్ష నేతలకు వివరించారు. బంగ్లాదేశ్ విషయంలో పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రతిపక్ష నాయకులు చెప్పారు.

Also Read : ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
తాజా కథనాలు