Bangladesh: షేక్ హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు.. ప్రణాళిక బద్ధంగానే కుట్ర!

షేక్ హసీనా నమ్మిన బంటే తనను వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమాన్‌ ప్రణాళిక బద్ధంగానే హసీనాపై కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టినట్లు రాజకీయ విశ్లేషకుల్లో చర్చ నడుస్తోంది. మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల నిర్ణయం దీనికి మరింత బలాన్నిస్తుంది.

Bangladesh: షేక్ హసీనాకు ఆర్మీ చీఫ్ వెన్నుపోటు.. ప్రణాళిక బద్ధంగానే కుట్ర!
New Update

Sheikh Hasina: బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులకు ఆ దేశ ఆర్మీ చీఫ్ వకార్‌-ఉజ్‌-జమాన్‌ కారణంగా తెలుస్తోంది. షేక్ హసీనాతో నమ్మకంగా ఉంటూనే ఆమె పాలన యంత్రాంగానికి వెన్నుపోటు పొడిచినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆందోళనలు, నిరసనలను కట్టడి చేయాల్సిన సైన్యాధిపతి తానే స్వయంగా ఉద్యమాన్ని ఎగదోసినట్లు చర్చ నడుస్తోంది. అంతేకాదు హసీనా బంగ్లాదేశ్ విడిచి వెళ్లిపోగానే అధికారం తన చేతుల్లోకి తీసుకోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

ప్రణాళిక బద్ధంగానే హసీనాపై కుట్ర..
అంతటితో ఆగకుండా దేశంలో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హసీనాకు 45 నిమిషాల సమయం ఇచ్చింది సైన్యం. ఈ పరిస్థితుల్లోనే హసీనాకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేస్తూ అధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ ఆదేశాలు ఇవ్వడం విశేషం. కాగా ఇందతా చూస్తుంటే ఒక ప్రణాళిక బద్ధంగానే హసీనాపై కుట్ర చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టినట్లు రాజకీయ విశ్లేషకుల్లో చర్చ నడుస్తోంది.

ఇక 2024 జూన్‌ 23న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా నియమితుడైన జమాన్.. మాజీ సైన్యాధిపతి ముస్తఫిజుర్‌ రెహమాన్‌ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. షేక్‌ హసీనాకు ముస్తఫిజుర్‌ రెహమాన్‌ వరుసకు మామ అవుతాడు. అతను జమాన్‌ బంధువు కూడా కావడంతో హసీనా అతడి వైపే మొగ్గు చూపించారు. కానీ చివరికి నమ్మినంబటే హసీనాను ఊహించని షాక్ ఇచ్చి, బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే హసీనా ఏకంగా దేశం వదిలి పారిపోయేలా చేయడం విశేషం.

ఇది కూడా చదవండి: Sheikh Hasina: షేక్ హసీనాకు బ్రిటన్ బిగ్ షాక్.. తమ చట్టం ఒప్పుకోదంటూ!

అయితే జమాన్ గురించి భారత్‌ ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. జమాన్‌ చైనా అనుకూల వ్యక్తి అని, అతడితో జాగ్రత్తగా ఉండాలని భారత జాతీయ భద్రతా మండలి అధికారులు హసీనాను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ హసీనా ప్రభుత్వం అతడి నియామకానికే మొగ్గుచూపించడం హాస్యస్పదం. ఇక జమాన్‌ నాలుగు దశాబ్దాల పాటు మిలిటరీలో ఉన్నారు. డిఫెన్స్‌ స్టడీస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. గతంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ విభాగంలో ప్రిన్సిపల్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌గా విధులు నిర్వర్తించారు. ఆర్మీని ఆధునికీకరించడంలో కీలక పాత్ర పోషించిన అతడి సేవలను గుర్తించి ఈ ఏడాది జూన్‌లో మూడేళ్ల పదవీకాలానికి గానూ సైన్యాధిపతిగా హసీనా నియమించారు.

#bangladesh #sheikh-hasina #bangladesh-army-chief-zaman
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe