Bandi Sanjay: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి.. బండి సంజయ్ ప్రస్థానమిదే!

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన మోదీ 3.0 జట్టులో చోటుదక్కించుకోవడంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. బండి సంజయ్ ప్రస్థానం కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

Bandi Sanjay: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి.. బండి సంజయ్ ప్రస్థానమిదే!
New Update

Bandi Sanjay: కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన మోదీ 3.0 జట్టులో చోటుదక్కించుకొవడంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.

తొలి నుంచి హిందూత్వ బాటలోనే..
కరీంనగర్‌కు చెందిన బండి సంజయ్‌ బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కార్యకర్తగా ఉన్నారు. సరస్వతీ శిశుమందిర్‌లో విద్యాభ్యాసం చేసిన ఆయన తొలి నుంచి హిందూత్వ బాటలోనే నడిచారు. 1992లో అయోధ్య కరసేవకుడిగా పని చేసిన ఆయన ఎల్‌.కె.అడ్వాణీ సురాజ్‌ రథయాత్ర సమయంలో వాహన బాధ్యుడిగా సేవలు అందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ పనుల నిమిత్తం ఢిల్లీకి వచ్చిన తొలినాళ్లలో ఆయనకు సహాయకులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ వ్యవహరించారు. ఢిల్లీలో బీజేపీ కార్యాలయ ఇన్‌ఛార్జిగా... పార్టీ ప్రచార ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా..
భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా.. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా.. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా.. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. యువమోర్చా జాతీయ కార్యదర్శిగా ఉన్న సమయంలో కేరళ, తమిళనాడు ఇన్‌ఛార్జిగానూ పని చేశారు. 2020 మార్చిలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సంజయ్‌.. 2023 జులై వరకు కొనసాగారు. ఈ సమయంలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. జులైలో పార్టీ అధిష్ఠానం ఆయన్ను రాష్ట్ర సారథ్య బాధ్యతల నుంచి తప్పించి.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే.

#union-minister #bandi-sanjay
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి