Telangana Elections: బీఆర్‌ఎస్ వస్తే మోటార్లకు మీటర్లే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

మానకొండూరు నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్.. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టాలనుకుంది సీఎం కేసీఆరేనని ఆరోపించారు. మేం వార్నింగ్ ఇస్తేనే ఆయన వెనకడుగు వేశారని.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదముందన్నారు.

New Update
Telangana: మెదక్‌ ఘటనపై బండి సంజయ్ సీరియస్‌.. చర్యలు తీసుకోవాలని ఆదేశం

మరో తొమ్మిది రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఇప్పటికే ఈ మూడు పార్టీలు మేనిఫెస్టోను కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మానకొండూరు నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్‌తో కలిసి బెజ్జంకిలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టాలనుకుంది కేసీఆరేనని.. మేం వార్నింగ్ ఇస్తేనే వెనకడుగు వేశారని.. మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెట్టే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also read: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన కీలక నేత!

కేసీఆర్‌కు ఓట్లేసి గెలిపిస్తే.. ఆయన తాగి పడుకోవడం తప్పు చేసిందేమి లేదంటూ ఎద్దేవ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశమంతటా.. పేదలకు ఇండ్లు మంజూరు చేస్తోందని.. తెలంగాణలో 2.4 లక్షల ఇళ్లకు నిధులు మంజూరు చేస్తే.. కేసీఆర్‌ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అలాగే 50 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వలేదని, కనీసం నిరుద్యోగ భృుతి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇక్కడి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఈ విషయాల పట్ల ఎందుకు నిలయదీయలేదంటూ ప్రశ్నించారు. దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్లు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారని కేసీఆర్‌ స్వయంగా చెప్పారని.. అయినా కూడా కేసీఆర్‌ వాళ్లకే టికెట్లు ఎందుకు ఇచ్చారంటూ మండిపడ్డారు. వీళ్లే కేసీఆర్‌కు అందులోని వాటాను పంపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రతిఏడాది పేదలకు ఉచితంగా నాలుగు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. అలాగే రైతులకు వరికి కనీస మద్దతు ధర రూ.3100 చెల్లిస్తామని ప్రకటించారు. బీజేపీకి ఓట్లేసి గెలిపించాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు