Telangana Election 2023: నీ ఆస్తిపాస్తులన్నీ ప్రజలకు పంచే దమ్ముందా..?: బండి సంజయ్

తెలంగాణ ఎన్నికల వేళ గంగుల కమలాకర్ మీద బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అక్రమంగా సంపాధించిన ఆస్తులు ఏమున్నాయో నిరూపిస్తే.. వాటిని కరీంనగర్ ప్రజలకు పంచేందుకు సిద్ధమని బండి సంజయ్‌ సవాల్ విసిరారు.

Telangana Election 2023: నీ ఆస్తిపాస్తులన్నీ ప్రజలకు పంచే దమ్ముందా..?: బండి సంజయ్
New Update

కరీంనగర్ నియోజకవర్గంలోని బావూపేటలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలు హాజరై బండికు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను నోరు విప్పితే కరీంనగర్ రోడ్లపై తిరగలేవని సంజయ్ హెచ్చరించారు. గంగుల , కేసీఆర్ మీరు నిజమైన హిందువులైతే ఒవైసీ సోదరులను హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చి బొట్టు, హనుమాన్ చాలీసా చదివించే దమ్ముందా? అంటూ ప్రశ్నించారు. నేనెటువంటి వాడినో కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు. బిడ్డా..నన్ను అవినీతిపరుడని అంటున్నావ్‌ నేను నోరు విప్పితే నువ్వు, కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతారు జాగ్రత్త అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.

నేను వందల కోట్లు సంపాదించానని అంటున్నారు.. మీకు దమ్ముంటే.. నా ఆస్తిపాస్తులు, డబ్బుని సంపాదించినట్లు నిరూపిస్తే అవన్నీ కరీంనగర్ ప్రజలకే రాసిస్తాను. గంగుల అవినీతి, అక్రమాలతో సంపాదించిన ఆస్తిపాస్తులు, డబ్బు వివరాలన్నీ నేను ప్రజల ముందుంచుతా.. ప్రజలకు పంచి ఇచ్చేందుకు సిద్ధమా..? అంటూ బండి సవాల్ విసిరారు. గంగుల కేసీఆర్‌ను ఒప్పించి ఎన్ని నిధులు తీసుకొచ్చావో..? చెప్పాలన్నారు. తాను కేంద్రంతో మాట్లాడి ఎన్ని నిధులు తీసుకొచ్చానో లెక్కాతో సహా వివరించేందుకు సిద్ధమన్నారు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈసారి గెలిపిస్తే కొత్త రేషన్, ఇండ్లు ఇస్తానని గంగుల కమలాకర్ నిన్న కొత్తకొత్త మాటలు మాట్లడూతున్నారు. మంత్రిగా పనిచేసి  ఎంతమందికి రేషన్ కార్డు, బీసీ బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చావో చెప్పాలని ప్రశ్నించారు.

శ్రీలంక దుస్థితిని తీసుకొస్తారు

నన్ను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానన్నారు. ఆర్వోబీ, స్మార్ట్‌ సిటీ, రోడ్లు, వీధి దీపాలతో సహా గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే అభివృద్ధి పనులకు కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చింది నేనే. మోదీ గత 6 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఒక్క అవినీతి లేకుండా నేరుగా అపాయిట్‌మెంట్ లెటర్లు ఇచ్చారు. మరి కేసీఆర్ ఎంతమందికి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇచ్చారో..? చెప్పాలని డిమాండ్‌ చేశారు. నా భార్యాపిల్లలను పక్కనపెట్టి మీకోసం కొట్లాడితే నేను సంపాదించిన ఆస్తి 74 కేసులు అన్నారు. మరి కమలాకర్ ఎవరి కోసం కొట్లాడిండు? ఎన్నిసార్లు జైలుకు పోయిండు? మీరే ఆలోచించాలన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి శ్రీలంక దుస్థితిని తీసుకొస్తాడని ఆరోపించారు. ఇన్నాళ్లు కొండలు, గుట్టలు మాయం చేసి అడ్డగోలుగా సంపాదించి గ్రానైట్ కార్మికుల సంఘం ఎన్నికలు జరగకుండా చేస్తున్నన్నాడని ఆరోపించారు.

#bandi-sanjay #telangana-election-2023 #karimnagar-constituency #bavupet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe