2024 లోక్ సభ ఎన్నికలకు బీజేపీ(BJP) సన్నాహాలు ముమ్మరం చేసింది. యువత, మహిళలు, రైతులు, మైనారిటీ మోర్చాతో సహా ఇతర ఫ్రంట్లకు ఇంచార్జీలను బీజేపీ ప్రకటించింది. సునీల్ బన్సాల్‌ను యువ మోర్చా ఇన్ ఛార్జిగా నియమించారు. మహిళా మోర్చా ఇంచార్జ్ బాధ్యతలను బైజయంత్ పాండాకు అప్పగించారు. దీంతో పాటు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar)ను కిసాన్ మోర్చా ఇన్ ఛార్జిగా నియమించారు. తరుణ్ చుగ్‌ను ఎస్సీ మోర్చా ఇన్ చార్జిగా, రాధామోహన్ దాస్ అగర్వాల్‌ను ఎస్సీ మోర్చా ఇన్ చార్జిగా నియమించారు.
వినోద్ తావ్డేను ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) మోర్చా ఇంచార్జీగా, దుష్యంత్ కుమార్ గౌతమ్ను మైనారిటీ మోర్చా ఇన్చార్జిగా నియమించారు.
కరీంనగర్-వరంగల్ హైవేపై రాస్తారోకో:
గోవధపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు బుధవారం కరీంనగర్-వరంగల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. శంకరపట్నం మండలం మొలంగూరుకు చెందిన కుమార్ సోమవారం రాత్రి తన ఆవును ఇంటి ముందు కట్టేసినట్లు ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలు తెలిపారు. గర్భవతిగా ఉన్న ఆవును కొందరు దొంగిలించి చంపేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా ఆవును చంపడాన్ని ఖండిస్తూ డీజీపీ, కరీంనగర్ సీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు హుజూరాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి తెలిపారు.
Also Read: హోటల్ లో మాజీ మోడల్ హత్య..మృతదేహంతో పారిపోయిన నిందితుడు!