Bandi Sanjay And Kishan Reddy: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ స్వయంగా హాజరయ్యి బండి సంజయ్ ను ఆశీర్వదించారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యుత్ లేకుండా ఏ పనీ కాదని అన్నారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నాం అని చెప్పారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. విద్యుత్ కోతలు లేకుండా ఉండాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాలని తెలిపారు. మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతాం అని అన్నారు. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు.
Also Read: స్టాలిన్..నవీన్ పట్నాయక్..చంద్రబాబు కొత్త అడుగులు.. మారుతున్న రాజకీయ సంప్రదాయాలు