Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీలో శాటిలైట్ ప్రయోగం!

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన బెలూన్ శాటిలైట్ ను మోహన్ బాబు నింగిలోకి ఎగురవేశారు. 5 కేజీల బరువు, 35 కిలోమీటర్ల ఎత్తులో దాదాపు 200 కిలోమీటర్లు బెలూన్ శాటిలైట్ పయనించనుంది.

New Update
Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీలో శాటిలైట్ ప్రయోగం!

Balloon satellite: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులు అభివృద్ధి చేసిన బెలూన్ శాటిలైట్ ను డాక్టర్ మంచు మోహన్ బాబు లాంచ్ చేశారు. NARL, IIST సహకారంతో శాటిలైట్ ను నింగిలోకి ఎగురవేశారు. ఈ ప్రయోగం విజయవంతం అయినందుకు విద్యార్థులు, సిబ్బందికి మోహన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు చంద్రగిరి మండలం మోహన్ బాబుయూనివర్సిటీలో చేపట్టిన ప్రాజెక్టు వాతావరణంలోని డయాక్పెడ్ స్థాయి, ఓజోన్ సాంద్రతలు, ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనం పై పరిశోధనలు ఈబెలూన్ శాటిలెట్ చేస్తుందని తెలిపారు. సుమారు 5 కేజీల బరువుతో 35 కిలోమీటర్ల ఎత్తులో 200 కిలోమీటర్లు బెలూన్ శాటిలైట్ పయనించనుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ప్రయోగం ప్రప్రథమంగా చేశామన్నారు. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించడానికి ప్రయోగాలు దోహదపడుతాయని ఆయన వెల్లడించారు. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు ఈ ప్రయోగం నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ప్రయోగానికి సహకరించిన ఇస్రో, శ్రీహరికోట శాస్త్రవేత్తలకు విద్యార్థులకు అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి:Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం.. కాల్పులు జరిపిన చోటే మళ్లీ!

Advertisment
తాజా కథనాలు