BB4 : ఇట్స్ అఫీషియల్, బోయపాటి - బాలయ్య మాస్ కాంబో రిపీట్ - ఈసారి అంతకుమించి!

నేడు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా బోయపాటి – బాలయ్య కాంబోలో తెరకెక్కనున్న నాలుగో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. #BB4 పేరుతో ఓ పోస్టర్ రిలీజ్ చేసి 'మన బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు' అని తెలిపారు.

New Update
BB4 : ఇట్స్ అఫీషియల్, బోయపాటి - బాలయ్య మాస్ కాంబో రిపీట్ - ఈసారి అంతకుమించి!

Balayya - Boyapati Combo Repeats For Fourth Time : టాలీవుడ్ (Tollywood) లో బోయపాటి (Boyapati) – బాలయ్య (Balakrishna) కాంబోకి ఉన్న క్రేజే వేరు. ఇప్పటికే సింహ , లెజెండ్, అఖండ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుగొట్టిన ఈ కాంబోలో మళ్ళీ మూవీ ఎప్పుడెప్పుడా ఆని అందరూ ఎదురుచూస్తున్నారు. 'అఖండ' లో ద్విపాత్రల్లో బాలయ్యబాబు నట విశ్వరూపాన్ని చూపించాడు.

2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. దీనికి సీక్వెల్‌ ఉంటుందని బోయపాటి గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇక నేడు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా వీరి కాంబోలో తెరకెక్కనున్న నాలుగో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇట్స్ అఫీషియల్...

#BB4 పేరుతో ఓ పోస్టర్ రిలీజ్ చేసి 'మన బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు' అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ని 14 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుండగా.. బాలయ్య చిన్న కూతురు మొదటి సారి ఈ సినిమాకి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు తాజా ప్రకటించిన #BB4.. 'అఖండ' (Akhanda) నా లేదంటే కొత్త సినిమానా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : అమరావతి అభివృద్ధే ప్రధాన కర్తవ్యం: RTVతో చంద్రబాబు ఎక్స్‌క్లూజీవ్

Advertisment
Advertisment
తాజా కథనాలు