Balakrishna Next Movie: బాలయ్య ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే న్యూస్.. నెక్స్ట్ మూవీ గురించి తెలిస్తే పూనకాలే..!

వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ల తర్వాత మరో సంచలన సినిమాకు బాలయ్య సైన్ చేశారు. బాబీ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందట. ఈ సినిమాలో బాలయ్య పార్ట్ ను కేవలం 28 రోజుల్లో షూట్ చేయాలని ప్లాన్ చేశారట మేకర్స్. ఎన్నికల నాటికి విడుదల చేయడానికి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
Balakrishna Next Movie: బాలయ్య ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే న్యూస్.. నెక్స్ట్ మూవీ గురించి  తెలిస్తే పూనకాలే..!

Balakrishna: అఖండ సినిమా నుంచి మొదలైన బాలయ్య క్రేజ్ అన్ స్టాపబుల్ గా కొనసాగుతూనే ఉంది. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన భగవంత్ కేసరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలయ్యకు కెరియర్ లో మరో విజయాన్ని అందించింది. భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు బాలయ్య. అంతే కాదు బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ నెంబర్ 1 రియాలిటీ షోగా గుర్తింపు పొందింది. కెరియర్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకు సిద్ధమయ్యారు.

publive-image

అయితే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలయ్య చాలా తక్కువ సమయం కేటాయించనున్నారు. కేవలం 28 రోజుల్లోనే ఆయన పార్ట్ షూటింగ్ పూర్తి చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ముందే ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండబోతుంది. ఈ సినిమా కథ రానున్న ఎన్నికల్లో బాలయ్య, టీడీపీకి ప్రయోజనంతో ప్రచారం కల్పించేలా ఉంటుందని టాక్ నడుస్తోంది.
publive-image

ఎన్నికల ముందు పొలిటికల్ కంటెంట్ తో వచ్చే సినిమాల ప్రభావం ప్రజల పై ఎక్కువగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ సీనియర్ NTR నటించిన 'నా దేశం' సినిమా. ఈ సినిమా రీలీజ్ అయ్యాక NTR నిర్మాతతో ఇలా అన్నారట.. సినిమా చాలా విజయవంతంగా జనాల్లోకి వెళ్తుంది.. నేను వెళ్లలేని ప్రాంతాలకు కూడా ఈ సినిమా ద్వారా నా గొంతు వినిపించిందంటూ.. కృతజ్ఞతలు తెలిపారంట.
publive-image

ఇప్పుడు బాబీ కూడా బాలయ్య పై ఇదే ప్రయోగం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పొలిటికల్ కంటెట్ ఉండబోతుందట. అలాగే ఈ సినిమా ద్వారా ఎన్నికల ప్రచారానికి కూడా పనికి వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్, డిసెంబర్ లో షూటింగ్ పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో మరో సారి బాలయ్య పవర్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

publive-image

Also Read: Salaar Movie: రిలీజ్ కు ముందే రూ.175 కోట్ల కలెక్షన్స్‌.. దిమ్మతిరిగేలా సలార్ క్రేజ్‌..!

Advertisment
Advertisment
తాజా కథనాలు