Jailer 2 : ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. రజినీకాంత్ సినిమాలో బాలయ్య!

'జైలర్ 2' లో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ చేస్తున్నారట. సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

New Update
Jailer 2 : ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. రజినీకాంత్ సినిమాలో బాలయ్య!

Latest Update On Jailer Sequel : సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) గత ఏడాది నటించిన 'జైలర్' (Jailer) సినిమా కోలీవుడ్ (Kollywood) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రజినికాంత్ కి భారీ కంబ్యాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సీక్వెల్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటికొచ్చింది.

గ్యాంగ్ స్టర్ రోల్ లో బాలయ్య...

'జైలర్ 2' లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గెస్ట్ రోల్ చేస్తున్నారట. సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. పార్ట్-1 లో మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ అతిథి పాత్రల్లో మెరిశారు. వారి పాత్రలకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జైలర్ సీక్వెల్‌లో బాలకృష్ణ గెస్ట్‌ రోల్‌లో కనిపించనుండటం సర్వత్రా ఆసక్తిగా మారింది.

Also Read : శర్వానంద్ కి కొత్త ట్యాగ్.. ఇక నుంచి స్టార్ శర్వానంద్, ఏ స్టార్ అంటే?

'జైలర్' లో మిస్..

అసలైతే 'జైలర్' మూవీలోనే బాలయ్య గెస్ట్ రోల్ చేయాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. దాంతో ఆ రోల్ లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటించారు. పార్ట్-1 మిస్ అయినా ఇప్పుడు పార్ట్-2 లో బాలయ్య రోల్ ను డైరెక్టర్ మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పండగే.

Advertisment
తాజా కథనాలు