Balakrishna, Jr NTR Shakehand: నందమూరి అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఎందుకంటే అందరూ ఏకమయ్యారు.. ఒకే చోట కనిపించారు.. సందడి చేశారు. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష వివాహం సాయి గీతికతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకి వచ్చారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి మోక్షజ్ఞ, కళ్యాణ్ రామ్.. ఇలా నందమూరి కుటుంబంతో పాటు నారా కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో చంద్రబాబు కూడా సందడి చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..JR NTR, NBK: బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ ఇష్యూ ఏంటి? అసలేం జరిగింది?
ఎన్టీఆర్, బాలకృష్ణ షేక్ హ్యాండ్ ఇష్యూపై సోషల్‌మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని తనయుడు వివాహ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అయితే జూనియర్ని బాలకృష్ణ సరిగ్గా రిసీవ్ చేసుకోవలేదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు సోషల్‌మీడియాలో నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నందమూరి మోక్షజ్ఞ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దిగిన ఫొటో వైరల్ అవుతోంది.
Translate this News: