/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/SS-jpg.webp)
Indian Air Force : 2019లో జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) లో పుల్వామా దాడి జరిగిన తర్వాత.. భారత వాయు దళం పాకిస్థాన్(Pakistan) లో బాలకోట్‌లో సర్జికల్ స్ట్రైక్(Surgical Strike) చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చీఫ్, బీజేపీ నేత మర్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ(Narendra Modi) నాయకత్వంలో.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పలు విధానాలను అమలు చేస్తోందని తెలిపారు. బీజేపీ.. సర్జికల్ స్ట్రైక్‌తో పాటు అనేక ఉగ్రదాడులపై వేగంగా స్పందిస్తోందని పేర్కొన్నారు.
Also Read: గాల్లో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10 మంది మృతి
'బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని మోదీ.. జీరో ఉగ్రవాదం విధానాన్ని తీసుకొచ్చారు. ఉగ్రదాడులు జరిగినప్పుడు.. ముష్కరులు సరిహద్దుల్లో దాక్కున్నారు. అప్పుడు నియంత్రణ రేఖ (LoC) వెంట కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ జరిపించింది. పుల్వామా దాడి జరిగినప్పుడు బాలకోట్‌లో సరైన సమయానికి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించారు. ఇది అతి ముఖ్యమైన ఘట్టం. అలాగే ఉగ్రవాదులకు ఓ గట్టి హెచ్చరిక. ఇది జరిగిన తర్వాత ఎలాంటి ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకోలేదు. పాకిస్థాన్ వాయు దళం, సైనిక దళాన్ని ఛేదించి ఈ ఎయిర్‌స్ట్రైక్ దాడులు జరిగాయి. మనకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇది ఒక విజయవంతమైన ఆపరేషన్. మనదేశంలో ఎవరైన ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తే.. వాళ్లు ఎక్కడ దాక్కున్నా పట్టుకొని చర్యలు తీసుకుంటున్నారు. దీనిబట్టి చూస్తే ఉగ్రవాదంపై ఇది జీరో పాలసీ విధానమని' భదౌరియా అన్నారు.
Also Read: ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం.. మీరు బుక్స్ చదువుతారా
#WATCH | Fatehpur Sikri, UP: BJP leader and former IAF chief, Air Chief Marshal RKS Bhadauria (Retd.), says, "When BJP came to power, PM Modi made a clear policy of zero tolerance against terrorism. When a terror incident occurred and perpetrators hid across the border, a… pic.twitter.com/orXdtHZlt0
— ANI (@ANI) April 22, 2024
Also Read : పద్మ అవార్డుల పురస్కారం.. 132 మంది గ్రహితలు వీళ్లే