Balagam Venu: బలగం వేణు కొత్త సినిమాలో స్టార్ హీరో.. టైటిల్‌ ఏంటంటే..

బలగం డైరెక్టర్ వేణు తన నెక్స్ట్ మూవీ నేచురల్ స్టార్ నానితో చేయబోతున్నారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. వేణు- నాని కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి 'ఎల్లమ్మ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
Balagam Venu: బలగం వేణు కొత్త సినిమాలో స్టార్ హీరో.. టైటిల్‌ ఏంటంటే..

Director Balagam Venu - Nani Movie: జబర్దస్త్ వేణుగా అందరికీ పరిచయమైన వేణు.. ఇప్పుడు బలగం వేణుగా మారిపోయాడు. బలగం సినిమాతో (Balagam Movie) దర్శకునిగా కెరీర్ స్టార్ట్ చేసిన వేణు మొదటి సినిమాకే  హిట్ కొట్టేశారు. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొని ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. దీంతో వేణుకు స్టార్ హీరోలు, సినీ ప్రముఖల నుంచి ప్రశంశలు దక్కాయి. తెలంగాణ సంస్కృతి, ఆచారాల ప్రధానంగా రూపొందిన బలగం  వేణు కెరీర్ కు బ్రేక్ ఇవ్వడంతో పాటు డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చింది.

ఈ సినిమా తర్వాత  వేణు.. తన నెక్స్ట్ మూవీ నేచురల్ స్టార్ నానితో (Hero Nani) చేయబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ మూవీ స్రిప్ట్ కు సంబంధించిన చర్చలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ గురించి మరో లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.

Also Read: Saindhav OTT Release: వెంకటేష్ సైంధ‌వ్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

publive-image

నాని సినిమాకు 'ఎల్లమ్మ'  టైటిల్ 

బలగం వేణు - హీరో నాని కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి..  తెలంగాణాలో బాగా పాపులర్ అయిన పేరు.. 'ఎల్లమ్మ' (Ellamma) అనే టైటిల్ పెట్టడానికి చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దాదాపు ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరలవుతుంది. నిర్మాత దిల్ రాజ్ (Dil Raju), నాని కూడా ఈ సినిమాకు సంబంధించి వేణుకు పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణాలో ఎల్లమ్మ ను గ్రామదేవతగా పూజిస్తారు. ఇక సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ పెట్టడంతో మరింత ఆసక్తిగా మారింది. మరో సారి తెలంగాణ నేటివిటీతో (Telangana Nativity) వేణు సినిమా ఉండబోతుందా అనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక  ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ టైటిల్ కు సంబంధించిన న్యూస్ నెట్టింట్లో వైరలవుతుంది.

Also Read: Chiranjeevi: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి

Advertisment
తాజా కథనాలు