భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం!

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి గోదావరి నీటి మట్టం 53.1 అడుగులు ఉండగా, శనివారం ఉదయానికి నీటి మట్టం మరో అడుగు పెరిగింది. ఉదయం 6 గంటలకు 54.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీరు గోదావరికి వచ్చి చేరుతుంది.

New Update

దీంతో అప్రమత్తమైన భద్రాచలం అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటి వరకు సుమారు 3 వేల మందికి పైగా ప్రజలను తరలించినట్లు అధికారులు వివరించారు. ఎగువ నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాద హెచ్చరికలు మారే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి గోదావరికి భారీ స్థాయిలో వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో భద్రాచలం నీటి మట్టం 56 అడుగుల నుంచి 58 అడుగులకు చేరే అవకాశాలున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రియాంక వివరించారు. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గోదావారి ఉగ్రరూపంతో ఖమ్మం, వాజేడు, చర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తున్నది. దీంతో ఇరు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
అంతేకాకుండా భద్రాచలం నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ లకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి.

విజయవాడ జగదల్‌ పూర్‌ జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారులను మూసివేసిన అధికారులు. మూడు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో జాతీయ రహదారి వెంట భారీగా నిలిచిపోయిన రవాణా వాహనాలు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు అధికారులును అడిగి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు.

అధికారులందరూ కూడా క్షేత్ర స్థాయిలో ఉండి పునరావాస కేంద్రాల గురించి, ప్రజల పరిస్థితుల గురించి ఎప్పటికప్ప్పుడు ఆరా తీయాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు