ఓ వైపు నిత్యవసర ధరలు, మరోవైపు ఇంధనం ధరలు సామాన్యులు కోలుకోలేని దెబ్బకొడుతున్నాయి. మొన్నటి వరకు టమోటా ధరలు చుక్కలు చూపించాయి. ఇప్పటి పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది జేపీ మోర్గాన్ యొక్క EMEA ఎనర్జీ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ క్రిస్టియన్ మాలెక్. రానున్న రెండు-మూడేళ్లలో పెట్రోలు, డీజిల్పై అధిక ధరలు భారీగా పెరగనున్నట్లు తెలిపింది. ముడి చమురుపై తాజా అధ్యయనం ప్రకారం, JP మోర్గాన్ యొక్క EMEA ఎనర్జీ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ క్రిస్టియన్ మాలెక్, కొన్ని రోజుల్లో బ్రెంట్ ధర పెరుగుదల 2026 సంవత్సరం నాటికి బ్యారెల్కు $ 150కి చేరుకోవచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్కు 94-96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
పూర్తిగా చదవండి..వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!
వాహనదారులకు షాకింగ్ న్యూస్. త్వరలోనే ఇంధనం ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముడి చమురుపై తాజా అధ్యయనం ప్రకారం రానున్న రెండు మూడేళ్లలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరగున్నాయని తెలిపింది. 2026 సంవత్సరం నాటికి బ్యారెల్కు $ 150కి చేరుకోవచ్చని హెచ్చరించింది.

Translate this News: