Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా డార్లింగ్ కొత్త సినిమా

రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ప్రభాస్‌ నటించనున్న 'స్పిరిట్' మూవీ మరింత ఆలస్యం కానుందట. నిజానికి ఇదే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.

New Update
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా డార్లింగ్ కొత్త సినిమా

Prabhas Spirit Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్‌ - సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'స్పిరిట్‌'. ఈ ప్రాజెక్ట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో అభిమానులకు బ్యాడ్ న్యూస్ అంటూ ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే, ప్రభాస్ ‘స్పిరిట్‌’ సినిమా సెట్స్‌లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టనున్నారట. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాదే మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందట. అంతేకాదు సినిమాను 2025 కు కాకుండా 2026 లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : రజినీకాంత్ ను కలిసిన ‘లై’ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

ఇక ఈ న్యూస్ విన్న డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కాగా స్పిరిట్ కంటే ముందు హను రాఘవపూడి సినిమాను పూర్తి చేయబోతున్నారట ప్రభాస్. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

Advertisment
తాజా కథనాలు