రుచిలో తియ్యగా ఉండే బొప్పాయి...ఆరోగ్యానికి పోషకమైన పండ్లలో ఒకటి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో మాత్రమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇది కాకుండా, ఇది శరీరానికి అనేక పోషకాలను కూడా అందిస్తుంది. అయితే బొప్పాయితో పాటు వీటిని తిన్నట్లయితే జీర్ణసంబంధిత సమస్యలను ఎదుర్కొవల్సి ఉంటుంది. ఇది ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అంతే కాదు, కడుపు నొప్పితోపాటు.. హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో బొప్పాయి తిన్న తర్వాత ఈ పదార్థాలను ఎట్టిపరిస్థితిల్లోనూ తినకూడదు. బొప్పాయి తర్వాత తినకూడనివి ఏంటో తెలుసుకుందాం.
పచ్చి గుడ్డు:
బొప్పాయి తర్వాత పచ్చి గుడ్డు తినకూడదు. ఇది మీ ఆరోగ్యానికి విషంలా పనిచేస్తుంది. ఎందుకంటే బొప్పాయిలో ఉండే పపైన్ గుడ్లలో ఉండే ప్రొటీన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలను పెంచుతుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ పచ్చి గుడ్లలో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. దీని వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి: కరోనాకు, గుండెపోటుకు లింక్! కేంద్రం సంచలన ప్రకటన..!
పాలు, పాల ఉత్పత్తులు:
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఈ పాలను బొప్పాయితోపాటు లేదా తాగిన తర్వాత తినకూడదు. ఇది పాలలో ఉండే ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. ఇవి కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు రావచ్చు.
చికెన్ లేదా చేపలు:
బొప్పాయిలో ఉండే పాపైన్ చికెన్, ఫిష్‌లలో ఉండే ప్రొటీన్‌లను విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కడుపు సమస్యలు వస్తాయి. బొప్పాయి తిన్న వెంటనే చికెన్ లేదా చేపలు తినకూడదు. ఇది కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలను పెంచుతుంది. బొప్పాయిలో ఉండే పపైన్ చికెన్, చేపలలో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది.
దానిమ్మ, బొప్పాయి:
కొంతమంది బొప్పాయి, దానిమ్మ గింజలను ఫ్రూట్ చాట్‌లో కలుపుతారు. దీంతో దానిమ్మ గింజలు జీర్ణం కావడం కష్టమవుతుంది. దీని వల్ల కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పొరపాటున కూడా బొప్పాయి, దానిమ్మపండు కలిపి తినకండి.
మసాలా ఆహారం:
బొప్పాయి పండు తిన్న తర్వాత పొరపాటున కూడా కారంగా ఉండే ఆహారం తినకూడదు. ఇది కడుపులో మంట, నొప్పిని పెంచుతుంది. దీని కారణంగా కడుపులో ఇబ్బందికరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. దీన్ని నివారించడానికి, బొప్పాయి తర్వాత స్పైసీ ఫుడ్ తినవద్దు.
ఇది కూడా చదవండి: టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్..!!