Spain : భార్యపై అవినీతి ఆరోపణలు.. స్పెయిన్ ప్రధాని రాజీనామా !

స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన భార్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏకంగా తన పదవి నుంచి తప్పుకునేందుకు వెనకాడటం లేదు. తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తానని పేర్కొన్నారు.

New Update
Spain : భార్యపై అవినీతి ఆరోపణలు.. స్పెయిన్ ప్రధాని రాజీనామా !

Spain PM Resign : స్పెయిన్(Spain) ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్(Pedro Sanchez) సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన భార్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏకంగా తన పదవి నుంచి తప్పుకునేందుకు వెనకాడటం లేదు. తన భార్య బెగోనా గోమెజ్‌పై అక్రమ ఆస్తులు(Illegal Assets) కూడబెట్టారనే అనుమానంతో న్యాయస్థానం విచారణ ప్రారంభించిన అనంతరం రాజీనామ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పెయిన్ ప్రధాని బుధవారం తెలిపారు. ' నేను ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహించాలా వద్దా.. నేను ఈ పదవిని వదుకోవాలా వద్దా అని నిర్ణయించుకునేందుకు కొంచెం ఆలోచించాలి అని ఇటీవల ఎక్స్‌(X) లో పోస్ట్ చెసిన లేఖలో తెలిపారు. సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని.. అప్పటివరకు షెడ్యూల్ నిలిపివేస్తానని చెప్పారు.

Also Read: పిల్లల్ని కంటే రూ.61 లక్షల ప్రోత్సాహకం

అయితే బెగోనా గోమెజ్‌పై వచ్చిన నేరారోపణలు, అవినీతిపై తాము విచారణ మొదలుపెట్టామని మాడ్రిడ్ కోర్టు బుధవారం తెలిపింది. బెగోన్‌పై మానోస్ లింపియాస్ (క్లీన్ హ్యాండ్స్) అనే అవినీతి వ్యతిరేక గ్రూప్ ఫిర్యాదు చేయడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిధులు లేదా కాంట్రాక్టులను పొందిన అనేక కంపెనీలతో గోమెజ్‌కు ఉన్న సంబంధాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆన్‌లైన్ వార్తా సంస్థ ఎల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ చేసిన కొద్ది గంటల్లో కోర్టు ఈ ప్రకటన చేసింది. ఎయిర్ యూరోపాకు చెందిన స్పానిష్ టూరిజం గ్రూప్‌ గ్లోబాలియాతో గోమెజ్‌కు ఉన్న సంబంధాలతో ఈ విచారణ మడిపడి ఉందని ఈ వార్తా సంస్థ తెలిపింది.

ఇదిలాఉండగా.. ప్రధానమంత్రి భార్య అవినీతికి పాల్పడ్డారని కొన్ని రోజుల నుంచే విపక్ష పాపులర్ పార్టీ (PP) ఆరోపిస్తూనే ఉంది. ఇవి తప్పుడు ఆరోపణలు అని ప్రధాని పెడ్రో శాంచెజ్ కొట్టిపారేశారు. ఆమె ఏదైన చట్టవిరుద్ధం చేసినందుకు కాదు.. నా భార్య కాబట్టే కాబట్టే ఆరోపణలు చేస్తున్నారని గతంలో ప్రధాని అన్నారు. అయితే ఇప్పుడు పెడ్రో శాంచెజ్ తన పదవికి రాజీనామా చేస్తారా లేదా అనే అంశం స్పెయిన్‌లో చర్చనీయాంశమవుతోంది.

Also read: సరిహద్దులు దాటిన మానవత్వం… పాక్‌ యువతికి భారతీయుని గుండె!

Advertisment
Advertisment
తాజా కథనాలు