చిరుతనా? ఎలుగుబంటినా? లక్షిత మరణానికి కారణం ఏంటి?

చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన ఫోరెన్సిక్‌ నిపుణులు. చిన్నారిని చిరుతే చంపినట్లు పేర్కొన్న నిపుణులు. లక్షిత పై దాడి చేసింది చిరుత పులే. చిన్నారి తండ్రి దినేష్ కుమార్ సైతం లక్షిత ను చిరుత పులి దాడి చేసినట్టుగా స్పష్టం చేశారు.

చిరుతనా? ఎలుగుబంటినా? లక్షిత మరణానికి కారణం ఏంటి?
New Update

తిరుమల తిరుపతి అలిపిరి నడక మార్గంలో మరోసారి విషాదం నెలకొంది. చిన్నారి పై చిరుత దాడి చేసి, చంపేసినట్లుగా చిన్నారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే చిన్నారిని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది చిరుత కాదేమోననే అనుమానాన్ని ఫారెస్ట్ అధికారులు వ్యక్త పరుస్తున్నారు.

పాప ఎలుగుబంటి దాడిలో చనిపోయినట్లు భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాప ఒక్కటే నడిచి వెళ్తున్న సమయంలో ఎలుగుబంటి పాపను తీసుకుని వెళ్లినట్లు అనుమానం అని పేర్కొన్నారు. పాప మెట్ల మార్గంలో నడవకుండా పక్కకు వెళ్లడంతోనే ఒక్కసారిగా ఎలుగు బంటి దాడి చేసి అపహరించినట్లు అధికారులు భావిస్తున్నారు.

పాప మృతదేహం మీద ఉన్న గాయాలను చూస్తుంటే ఎలుగుబంటే దాడి చేసినట్లు తెలుస్తుందని వారు పేర్కొన్నారు. సీసీ కెమెరా విజువల్స్‌ ని చూస్తే ఈ విషయం మీద స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

చిరుతే చంపింది!

చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన ఫోరెన్సిక్‌ నిపుణులు. చిన్నారిని చిరుతే చంపినట్లు పేర్కొన్న నిపుణులు. లక్షిత పై దాడి చేసింది చిరుత పులే. చిన్నారి తండ్రి దినేష్ కుమార్ సైతం లక్షిత ను చిరుత పులి దాడి చేసినట్టుగా స్పష్టం చేశారు. అయితే కొందరు మాత్రం పాప మీద ఎలుగు బంటి దాటి చేసినట్లు పేర్కొంటున్నారు.


అసలేం జరిగింది..!

నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన దినేశ్ కుటుంబం తిరుమల వచ్చారు. అలిపిరి నడకదారి మార్గంలో తిరుమలకు స్టార్ట్ అయ్యారు. నడుచుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా పాప లక్షిత తమతో లేదన్న విషయాన్ని కుటుంబసభ్యులు గమనించారు. లక్షిత ఎక్కడో తప్పిపోయి ఉంటుందని అంతా భావించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా మిస్సింగ్‌ కేసే అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా పాప కనిపించలేదనే అనుకున్నారు కానీ చిరుత దాడి చేస్తుందని అసలు ఊహించలేకపోయారు.

లక్షిత కోసం గాలించడం మొదలుపెట్టిన టీటీడీ అటవీ శాఖ, విజిలెన్స్, పోలీసులకు నరసింహస్వామి ఆలయం వద్ద లక్షిత మృతదేహం కనిపించింది. లక్షిత శరీరంపై గాయాలు చూస్తే చిరుత దాడి చేసినట్టు వారికి క్లియర్‌గా అర్థమైపోయింది. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా.. పాపను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు బోరునా విలిపించారు.

నిన్నమొన్నటి వరకు లక్షిత ముద్దుముద్దు మాటలతో మురిసిపోయిన ఆ కుటుంబసభ్యుల ముఖాల్లో ఇప్పుడు విషాదం తప్ప మరెదీ కనిపించని స్థితి. ఎంతో చలాకీగా ఉండే లక్షితను అలా చూసే సరికి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు.

#tirumala #died #andhrapredhesh #baby-girl #chiruta-attcked
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe