Chandrababu Bail Updates: చంద్రబాబుకు మళ్లీ షాక్.. ఆ తరువాత వాదనలు వింటామన్న కోర్టు..

చంద్రబాబును సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. నిన్న సాయంత్రమే చంద్రబాబు కస్టడీ ముగియగా.. నేడు విచారణకు వచ్చింది క్వాష్ పిటిషన్ దాంతో.. హైకోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Chandrababu Bail Updates: చంద్రబాబుకు మళ్లీ షాక్.. ఆ తరువాత వాదనలు వింటామన్న కోర్టు..
New Update

Chandrababu Bail Updates: ఏసీబీ కోర్టులో ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే తమ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున వివేకానంద వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా సీఐడీ కౌంటర్‌లో రెండు పేరాలపై జడ్జి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు పేరాలు తొలగించి మళ్లీ కౌంటర్ ఫైల్ చేయాలని జడ్జి ఆదేశించారు. దాంతో 20 నిమిషాల సమయం కోరారు సీఐడీ అధికారులు.

ఇదిలాఉంటే.. బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాలని న్యాయస్థానాన్ని కోరారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. ముందు కస్టడీ పొడిగింపుపై దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినాలని సీఐడీ కోరింది. అయితే, మెమో ఫైల్ చేయాలని సీఐడీకి జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దాంతో మెమో దాఖలుకు సమయం కోరారు సీఐడీ అధికారులు. కస్టడీ పొడిగింపు మెమో సీఐడీ దాఖలు చేసిన తరువాత విచారణ మంగళవారం చేస్తామని జడ్జి తెలిపారు. కస్టడీ పొడిగింపు పిటిషన్ విచారణ తరువాత బెయిల్ పిటిషన్‌ను విచారిస్తామని జడ్జి తెలిపారు. కాగా, చంద్రబాబును మరో ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

క్వాష్ పిటిషన్ డిస్మిస్..

చంద్రబాబును సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. నిన్న సాయంత్రమే చంద్రబాబు కస్టడీ ముగియగా.. నేడు విచారణకు వచ్చింది క్వాష్ పిటిషన్ దాంతో.. హైకోర్టు ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు..

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను మంగళవారం మరోసారి మెన్షన్ చేయాలని సూచించారు సీజేఐ చంద్రచూడ్. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. చంద్రబాబు కస్టడీలో ఉన్నారని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు లూథ్రా. అయితే, ఈ పిటిషన్‌ను మంగళవారం మరోసారి మెన్షన్ చేయాలంటూ సూచించారు ప్రధాన న్యాయమూర్తి. కాగా, క్వాష్ పిటిషన్‌పై విచారణ కోసం చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హాజరవగా.. ఏపీ ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదించిన ముకుల్ రోహత్గీ, సీఐడీ తరఫున వాదించిన రంజిత్ కుమార్‌లుఉ కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.

Also Read:

Hyderabad: భాగ్యనగరం సిగలో మరో 5 ఫ్లైవర్స్.. నేడే శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్..

mynampally:మైనంపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం

#chandrababu-arrest #chandrababu-babu #supreme-court #ap-skill-development-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe