హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయ్యింది. తుని తపోవన పీఠాధీశ్వరులు సద్డురు సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి ప్రారంభించారు. రెండో రోజూ పూజలో భాగంగా గురువారం గోపూజ, గవ్యాంత పూజలు, మార్జనం, వాస్తుపూజ, వాస్తు హోమం, వాస్తు బలి, పర్యాగ్ని కరణ, రక్షకోద్దారణ, నిత్యోపాసన, మహాసుదర్శన హోమం, జలాధివాసం, తదంగ హొమాలు వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య వైభవంగా జరిగాయి.స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు.
కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వాములకు, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో సూరపనేని సునంద్- పద్మ ప్రియ దంపతులు దేవాలయ ఛైర్మన్ సీహెచ్ రామయ్య, ఈఓ ఎన్ లావణ్య, అయ్యప్పస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ శర్మ , రామకృష్ణ శర్మ దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం పూజలు:
ఉదయం 9 గంటలకు గోపూజ,గవ్యాంత పూజలు, మార్జనం, అష్టోత్తర కలశస్థాపన, క్షీరాధివాసం, హోమాలు, మండపారాధన, హారతి తీర్ధ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు చండీ హోమం, వేదపారాయణ సాయంత్రం 5 గంటలకు ధాన్యాధివాసం, శాంతి కుంభ స్థాపనలు, కుంభాభిషేక కలశస్థాపనలు, తదంగ హోమములు, నిత్యోపాసన, నిత్య బలిహరణ, తీర్థ ప్రసాద వితరణ. 5.00 గంటలకు భగవతీ సేవ, బ్రహ్మశ్రీ కృష్ణ నంబూద్రి (శబరిమల మాజీ మేల్‌శాంతి) వారి బృందంచే నిర్వహించబడును. 6.00 గం.లకు వీరమణిగారి బృందంచే భజన కార్యక్రమం నిర్వహించబడును.
శనివారం పూజలు:
ఉదయం 9.00 గంటలకు గోపూజ, ద్రవ్యాంగ పూజలు, మార్జనం మండప పూజలు, సుగంధ ద్రవ్యాలు, నదీ జలాలతో ‘జలాధివాసం’, హోమములు, నిత్యోపాసన, నిత్య బలిహరణ, హారతి, తీర్థ ప్రసాద వితరణ. ఉదయం 10 గంటలకు ‘శ్రీ రుద్ర సహిత మహా మృత్యుంజయ హోమం’, వేద పారాయణ. సాయంత్రం5 గంటలకు పంచ శయ్యాధివాసం, శాలాంగ దేవతా పూజ, పుష్పాధివాసం, వస్త్రాధివాసం, ఫలాధివాసం, అంగ ప్రత్యంగ శాలాంగ దేవాతాహోమం, నిత్యోపాసన, బలిహరణ, హారతి, ప్రసాద వితరణ. మధ్యాహ్నం 3.00 గంటలకు ‘శ్రీచక్ర నవావరణ పూజ’, బ్రహ్మశ్రీ మనోజ్ నంబూద్రి (శబరిమల మాజీ మేల్‌శాంతి) వారి బృందంచే నిర్వహించబడును.
ఆదివారం పూజలు:
ఉదయం 4.30 నిమిషాలకు మహా గణపతి హోమం, గవ్యాంత పూజలు, మార్జనం, బలిపీఠ పూజలు, ధాతు నిక్షేపణ. ఉదయం 7.27 నిమిషాలకు బలిపీఠములు, ధ్వజస్తంభం, చండీశ్వరుడు, ఆలయ శిఖర, యంత్ర ప్రతిష్ఠ. ఉదయం 9.00 గంటలకు అష్టోత్తర కలాశాభిషేక సహిత మహా కుంభాభిషేకం, జీవన్యాసం, మహా పూర్ణాహుతి, అవబృదం. ఉదయం 11.00 గంటలకు మహాపడి పూజ, బ్రహ్మశ్రీ కంఠరారు మహేష్ మోహన్ తంత్రి (శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు) గారిచే నిర్వహించబడును. 12.30 నిమిషాలకు అన్నసమారాధన సాయత్రం 7.00 గంటలకు పల్లకి సేవ, రాత్రి 9.00 గంటలకు హారతి, హరివరాసనం, తీర్థ ప్రసాద వితరణ జరుగును.
Also read: అంతా బాగుందనుకున్నాను..కానీ అలా జరిగిపోయింది: మాజీ విశ్వ సుందరి!
Also read: 2 వేల నోట్లను పోస్టులో పంపండి…ఆర్బీఐ మరో బంపర్ ఆఫర్