నాస్తికుడు బైరి నరేష్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని భీమాకోరేగామ్ స్ఫూర్తి సందర్భంగా విజయ్ దివాస్ (Vijay diwas) కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైరి నరేష్ (Bairi naresh) విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప, శివ స్వాములు (Ayyappa devotees) కార్యక్రమం జరిగే ఫంక్షన్ హాల్ కి చేరుకున్నారు.
వచ్చి రావడంతోనే బైరి నరేష్ మీదు విరుచుకుపడ్డారు. అయ్యప్ప స్వామి వారిని దూషించిన బైరి నరేష్ ఇక్కడ నుంచి వెంటనే పోవాలని వారు పట్టుబట్టారు. దాంతో బైరి నరేష్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గతంలో అయ్యప్ప భక్తుల పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడంతో పాటు ఆ మాటలను వెనక్కి కూడా తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ విషయం గురించి గతంలో కూడా జైలుకు వెళ్లడం కూడా జరిగిందని నరేష్ వివరించారు. అంతేకాకుండా తన మీద చాలా కేసులు కూడా నమోదు అయినట్లు బైరి నరేష్ స్వాములకు చెప్పారు. అయినప్పటికీ కూడా స్వాములు నరేష్ మాటను కతారు చేయలేదు. ఏమైనా సరే అక్కడ నుంచి వెళ్లాల్సిందేనని పట్టుబట్టి అక్కడ నుంచి పంపించేశారు.
ఈ క్రమంలో బైరి నరేష్ అక్కడ నుంచి వెళ్తున్న సమయంలో నర్సింగరావు అనే అయ్యప్ప భక్తుడిని కాలు పై నుంచి వెళ్లడంతో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో నరేష్ అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా నరేశ్ కారు ప్రమాదానికి గురైంది. దాంతో కారు అక్కడ వదిలేసి అడవుల్లోకి పారిపోయినట్లు స్థానికులు వెల్లడించారు.
గతంలో కూడా బైరి నరేశ్ అయ్యప్ప స్వామి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.దీంతో అప్పట్లోనే ఆయనపై అయ్యప్ప భక్తులు, హిందుసంఘాల ప్రతినిధులు దాడి చేశారు.
Also read: మూడు నెలలు ఆగండి..మేము నొక్కే బటన్లతో మీ అడ్రస్ లు గల్లంతే: ఏపీ అంగన్వాడీలు!