Water Leakage At Ayodhya Ram Mandir: వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిర మొదటి అంతస్తు నుంచి వర్షపు నీరు గర్భగుడిలోకి వస్తున్నట్లు అయోధ్య రామ మందిర ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
అసలు ‘‘ఇలా ఎందుకు వర్షపు నీరు (Rain Water) లోపలికి వస్తుంది.. గుడి పైకప్పును ఎలా నిర్మించారు.. నీరు లీక్ కాకుండా ఏం చేయాలి ?’’ అనే అంశాలపై ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు తీవ్రరూపు దాలిస్తే అయోధ్య రామాలయంలో నీటి లీకేజీ కారణంగా భక్తులు పూజలు చేయడం కష్టమవుతుందని సత్యేంద్ర దాస్ అన్నారు.
సత్యేంద్రదాస్ (Satyendra Das) వ్యాఖ్యలతో అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర (Nripendra) ఏకీభవించారు. పైకప్పు నుంచి నీటి లీకేజీ సమస్య ఉన్న మాట నిజమేనన్నారు. త్వరలోనే ఆలయం పైకప్పు మరమ్మతులు, వాటర్‌ఫ్రూఫింగ్ చేయిస్తామన్నారు. ‘‘ప్రాచీన ఆలయ నిర్మాణ శైలిలో భాగంగానే గురు మండపాన్ని ఓపెన్‌గా వదిలినట్లు ఆయన వివరించారు.
ఆలయ గోపురం నిర్మాణ పనులు పూర్తయ్యాక.. ఈ ఓపెన్ ప్రదేశాన్ని కవర్ చేస్తుంది. ఆలయం గర్భగుడి లోపల డ్రైనేజీ వ్యవస్థ లేదు. మ్యానువల్‌గా ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని, పైకప్పు నుంచి నీటి లీకేజీకి ఆలయ డిజైన్ సమస్య కానీ, ఆలయ నిర్మాణ సమస్య కానీ కారణం కాదు’’ అని నృపేంద్ర స్పష్టం చేశారు.