/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-5-12-jpg.webp)
Ram Mandir : జనవరి 22 దగ్గర పడుతోంది. శుభ ముహూర్తం ఆసన్న మవుతోంది. అయోధ్య(Ayodhya) లో రాముడు కొలువయ్యే వేళ సమీపిస్తోంది. దీంతో ఇక్కడ వేడుకలు ముమ్మరం అయ్యాయి. రామమందిరం ప్రారంభం, రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకకు కూడా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పదిరోజులు ముందుగానే సంబరాలు మొదలెట్టేశారు. ప్రధాని మోడీ(PM Modi) తో సహా ట్రస్ట్ నిర్వాహకులు దీక్షలు చేపట్టారు. ప్రతీ కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా నిర్వర్తిస్తున్నారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది.
రామమందిర ప్రత్యేక పోస్టల్ స్టాంప్..
రామమందిరం(Ram Mandir) ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ప్రధాని మోడీ ప్రత్యేక స్టాంప్‌ను విడుదల చేశారు. రామమందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, కేవత్‌రాజ్, శబరి ఫోటోలతో కూడిన మొత్తం ఆరు స్టాంప్‌లను విడుదల చేశారు. అయోధ్య ఆలయ ఆకృతి, గుడి ఆవరణలో ఉన్న కళాఖండాలు, సూర్యుడు, సరయూ నది ప్రతిబింబించేలా ఈ స్టాంప్‌లను డిజైన్ చేశారు. మంగళ్ భవన్ అమంగళ్ హరి అనే కవితను కూడా దీని మీద ముద్రించారు.
Also read:దావోస్‌లో రేవంత్ రెడ్డి సక్సెస్..తెలంగాణకు 37,870 కోట్లు
గర్భగుడిలో రాముని ప్రతిష్ఠ...
ఇక ఈరోజు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం గుడిలోకి తీసుకువచ్చిన రామ్ లల్లా(Ram Lalla) విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శుభముహూర్తంలో గర్భుగుడిలో స్థాపించారు. జై శ్రీరామ్ నినాదాల మధ్య రాముడి విగ్రహాన్ని ఉచిత స్థానంలో ప్రతిష్టించి సంకల్పం చేశారు. దాని తర్వాత గణేశాంబికా పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహవచనం, మాతృకాపూజ, వసోర్ధర పూజ (సప్త ఘృత్ మాతృకా పూజ), ఆయుష్య మంత్ర జపం, ఆచార్యాదిచత్విగ్వరణ్, మధుపర్క పూజలను నిర్వహించారు. వీటితో పాటూ బాల రాముడి విగ్రహానికి జలాధివాసం, గంధాదివాసం చేశారు. ఇక సాయంత్రం రామ్ లల్లా విగ్రహానికి ఆరాధన, హారతి కార్యక్రమాలు నిర్హించనున్నారు.
भगवान श्री रामलला सरकार के अनुजों सहित दिव्य दर्शन - अयोध्या धाम
पौष मास, शुक्ल पक्ष, अष्टमी तिथि, विक्रमी संवत् २०८०
Divya Darshans of Bhagwan Shri Ram Lalla, along with his brothers- Ayodhya Dham
Paush Maas, Shukla Paksh, Ashtami Tithi, Vikrami Samvat 2080 pic.twitter.com/fgZRqyNQi3
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 18, 2024
ఐదేళ్ల పసి బాలుడి రూపంలో రామ్‌లల్లా కనిపిస్తున్నారు. పసితనం, అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా విగ్రహం కనిపిస్తోంది. బాలరాముడి విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేశారు మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్. జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరగనున్న విషయం తెలిసిందే.