Ayodhya : మంగళ వాయిద్యాలు మారుమోగాయి.. మంత్రోచ్ఛారణతో అయోధ్య ప్రణవిల్లింది. జై శ్రీరామ్(Jai Shri Ram) అనే నినాదంతో దేశం మొత్తం పరవశించింది. ఆనందం అంబరాన్ని తాకింది. కోట్ల మంది ప్రజల సాక్షిగా అయోధ్య(Ayodhya) లో అద్బుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. బాలరాముడు కొలువయ్యాడు. మేషరాశిలో అభిజిత్ లగ్నంలో ప్రధాని మోడీ(PM Modi) రామ్ లల్లా(Ram Lalla) ప్రాణ ప్రతిష్ట(Prana Pratishtha) నిర్వహించారు. సరిగ్గా 12.29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట మహోత్సం జరిగింది. గంటసేపు పాటూ ప్రధాని చేత పండితులు పూజలు చేయించారు. చేతిలో పూజా ద్రవ్యాలతో ఆలయంలోకి ప్రవేశించిన మోడీ నియమ నిష్టలతో క్రతువును పూర్తి చేశారు. ప్రధాని స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటూ ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామ నామంతో మారుమోగిన అయోధ్య..
రామ్ లల్లా(Ram Lalla) విగ్రహ ప్రతిష్టాపనకు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. విశిష్ట అతిధులు అందరూ విచ్చేశారు. నగరం మొత్తం ఆధ్యత్మికంగా మారిపోయింది. సోనూ నిగమ్ వంటివారు రాముని పాటలతో అయోధ్యను మారు మోగించారు. నగరమంతా రామ్ లీల కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నిండిపోయింది. దేశ వ్యాప్తంగా కళాకారులు అయోధ్యకు వచ్చారు.
Also Read : జై శ్రీరామ్.. ప్రాణ ప్రతిష్ఠ.. లైవ్ అప్‌డేట్స్!
విశిష్ట అతిధులు...
అయోధ్య మహోత్సవానికి ఏడు వేల మంది విశిష్ట అతిధులు విచ్చేశారు. ఇందులో రాజకీయ ప్రముఖులు, సినీ సెటబ్రిలీలు, స్వామీజీలుఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, సైనా నెహ్వాల్, పి.వి.సింధు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక బాలీవుడ్ నుంచి అమితాబ్, అభిషేక్ బచ్చన్, రణబీర్, ఆలియా, కంగనా రనౌత్, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్ లు విచ్చేశారు.
Also Read : అయోధ్య వేడుకకు రాని జూ.ఎన్టీయార్ మరికొందరు…