అమెరికా వీధుల్లో రామనామస్మరణ.. మార్మోగిపోయిన వాషింగ్టన్ డీసీ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఉత్సవాలు అమెరికాలో ఘనంగా మొదలయ్యాయి. జై శ్రీ రాం నినాదాలతో వాషింగ్టన్ వీధులు మార్మోగిపోయాయి. ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్ సమీపంలోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో 'హిందూ అమెరికన్ కమ్యూనిటీ' సభ్యులు సంబరాలు చేసుకున్నారు. By srinivas 17 Dec 2023 in ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భారత దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులతోపాటు హిందూ మతాన్ని గౌరవించే వారంతా ఈ సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత రామమందిర నిర్మాణం జరుగుతున్నందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం 'హిందూ అమెరికన్ కమ్యూనిటీ' సభ్యులు వాషింగ్టన్ డీసీలో ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు అయోధ్య రామమందిరం నిర్మితమవుతున్న వేళ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమ్యూనీటి సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పేందుకు శ్రీరాముడి జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. జై శ్రీ రాం నినాదాలతో వాషింగ్టన్ వీధులు మార్మోగిపోయాయి. ఫ్రెడ్రిక్ సిటీ మేరీల్యాండ్ కు సమీపంలో ఉన్న శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో సమావేశమైన 'హిందూ అమెరికన్ కమ్యూనిటీ' సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఇది కూడా చదవండి : జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. దాబాలోకి దూసుకెళ్లిన లారీ ఇక దీనిపై మీడియాతో మాట్లాడిన సదరు కమ్యూనీటీ సభ్యులు.. 500 ఏళ్ల హిందువుల పోరాటం తర్వాత రామమందిర నిర్మాణం జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు జనవరి 20న దాదాపు వెయ్యికి పైగా అమెరికన్ హిందూ కుటుంబాలు అయోధ్య వేడుకల్లో పాల్గొంటాయని, ఇందులో రామ్ లీలా, రాముడి కథలు, ప్రార్థనలు, భజనలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు అమెరికా చాప్టర్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర సాపా మాట్లాడుతూ.. అమెరికాలో జన్మించిన పిల్లలకు హిందూ సంప్రదాయాలు, మతం గొప్పతనం అర్థం చేయించేందుకు 45 నిమిషాలపాటు శ్రీరాముడి జీవిత విశేషాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. #ayodhya-ram-mandir #celebrations #america మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి