Ayodhya Ram Lalla Idol: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తరువాత బాల రామున్ని చూసిన శిల్పి అరుణ్ (Arun Yogi Raj) యోగి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చెక్కిన శిల్పం అది కాదు ..బాల రాముడు మొత్తం మారిపోయాడంటూ చెప్పుకోచ్చాడు. కర్ణాటక మైసూర్ కు చెందిన శిల్పి యోగిరాజ్ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట (Ayodhya Ram Pran Pratishtha) కార్యక్రమం జరిగిన సమయంలో స్వామి వారు పూర్తి అలంకార భూషితుడై నేను మలచిన తీరుకు పూర్తి భిన్నంగా కనిపించాడంటూ చెప్పుకొచ్చారు.
బాల రాముని విగ్రహాన్ని (Ram Lalla Idol) చూసి ఇది నేను చేసిన శిల్పమేనా అనే అనుమానం వచ్చిందని అనుకున్నాను. ఇది నా పని తీరులా లేదని నేనే అనుకున్నాను. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తరువాత రాముల వారు వివిధ రూపాల్లో నాకు కనిపించారంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ పేర్కొన్నాడు.
'' స్వామి వారిని పూర్తి అలంకరణలో చూసిన తరువాత స్వామి వారి ముఖం పూర్తిగా మారిపోయింది. పూర్తి భిన్నంగా కనిపించారు. నాకే ఈ విగ్రహం నేను చెక్కినది కాదు అని అనుకున్నాను. వివిధ దశలలో వివిధ రూపాల్లో స్వామి వారు కనిపించారని శిల్పి అరుణ్ యోగిరాజ్ అన్నారు.
శిల్పం చెక్కే సమయంలో రాముడు నాకు ఆదేశాలు ఇచ్చాడు. ఆ ఆదేశాల ప్రకారమే నేను స్వామి వారిని తయారు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. "నా లల్లా నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను దానిని అనుసరించాను (రాముడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు మరియు నేను దానిని అనుసరించాను)" అని యోగిరాజ్ చెప్పారు.
విగ్రహాన్ని పూర్తి చేయడానికి నాకు సుమారు 7 నెలల సమయం పట్టింది. అది నాకు చాలా సవాలు తో కూడుకున్న సమయం. ఐదు సంవత్సరాల బాల రాముడిని తయారు చేయడం ఎంతో కష్టతరమైన పని . విగ్రహం శిల్ప శాస్తానికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలని యోగిరాజ్ వివరించారు.
'' ఓ రాయిలో భావం తీసుకుని రావడం అంత సులభమైన పని కాదు. రాముల వారి కళ్ల గురించి తన స్నేహితులను అడిగేవాడని యోగిరాజ్ పేర్కొన్నాడు. ఒక భావాన్ని శిల్పంలో తీసుకుని రావడం అంటే మాటలు కాదు. కాబట్టి పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాను. మిగతాదంతా రామ్ లల్లా వల్ల జరిగింది." అంటూ అరుణ్ వివరించారు.
Also read: హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు..నాకు విడాకులు కావాలి!