Ayodhya Mosque Construction: అయోధ్యలో మసీదు నిర్మాణం అప్పటినుంచే.. బాబ్రీ మసీదు పేరు మార్పు.. అయోధ్యలో మసీదును నిర్మించేందుకు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) డెవలప్‌మెంట్ కమిటీ సిద్ధమైంది. పవిత్ర రంజాన్ నెల తర్వాత ఈ ఏడాది మే నెలలో మసీదు నిర్మాణం మొదలుపెడతామని తెలిపింది. 3 నుంచి 4 ఏళ్లలో మసీదు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పింది. By B Aravind 22 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ayodhya Mosque: యూపీలోని అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ (Ayodhya Ram Mandir) కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. గతంలో సుప్రీంకోర్టు అయోధ్యలో మసీదు కోసం 5 ఎకరాలు కేటాయించాలని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మసీదును ఎప్పుడు నిర్మిస్తారనే ఆసక్తి నెలకొంది. 2019లో సుప్రీం ఇచ్చిన తీర్పు మేరకు అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో మసీదు నిర్మాణం కోసం స్థలం కేటాయించారు. ఇక్కడ మసీదును నిర్మించేందుకు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (IICF) డెవలప్‌మెంట్ కమిటీ సిద్ధమైంది. రీడిజైన్ వల్లే ఆలస్యం పవిత్ర రంజాన్ (Ramadan) నెల తర్వాత ఈ ఏడాది మే నెలలో మసీదు నిర్మాణం మొదలుపెడతామని.. ఐఐసీఎఫ్ డెవలప్‌మెంట్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న హాజీ అర్ఫత్ షేక్ వెల్లడించారు. 3 నుంచి 4 ఏళ్లలో మసీదు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అయితే రీడిజైన్ వల్లే మసీదు నిర్మాణం ఆలస్యమైనట్లు ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ అన్నారు. మసీదు ప్రాజెక్ట్ కాంప్లెక్స్‌లో 500 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళిక కూడా చేసినట్లు చెప్పారు. Also Read: అయోధ్యలో బాలరాముడి దర్శన వేళలు ఇవే.. ఇలా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు నిధులు లేవు అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దాదాపు 3 వేల కోట్లకు పైగా విరాళాలు అందాయని.. కానీ మసీదు నిర్మాణానికి నిధుల కొరత ఉందని ఐఐసీఎఫ్ ప్రెసిడెంట్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ అన్నారు. ఇప్పటివరకు నిధుల కొరకు తాము ఎవరినీ సంప్రదించలేదని.. ఎలాంటి ఉద్యమం చేపట్టలేదని చెప్పారు. అంతేకాదు.. భారత్‌లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ చక్రవర్తి పేరుతో ఉన్న బాబ్రీ మసీదు పేరును కూడా తొలగించనున్నారు. కొత్తగా నిర్మించబోయో మసీదుకు బిన్ అబ్దుల్లా మసీదుగా (Masjid Muhammed bin Abdullah) పేరు పెట్టనున్నారు. ఇలా చేస్తే పోరాటాలు ఆగుతాయి త్వరలోనే మసీదు నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని బీజేపీ లీడర్ షేక్ అన్నారు. ప్రజల మధ్య ఉన్న శత్రుత్వం, ద్వేషాన్ని ప్రేమగా మార్చడమే తమ ప్రయత్నమని చెప్పారు. సుప్రీం తీర్పును మేం అంగీకరించినా, అంగీకరించకపోయినా కూడా ప్రజలకు, పిల్లలకు మంచి విషయాలను బోధిస్తే ఇలాంటి పోరాటలన్నీ ఆగిపోతాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. 1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చేసిన అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఇందులో దాదాపు 2 వేల మంది మరణించగా.. అందులో మృతుల్లో ముస్లీంలు ఎక్కువగా ఉన్నారు. Also Read: అయోధ్య రామాలయానికి ఎక్కువగా విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా.. #national-news #ayodhya-ram-mandir #babri-masjid #ayodhya-mosque మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి