Tourist place:విదేశీయులు మెచ్చే భారత్..అద్భుతాలకు నెలవు కోకోనట్ ఐలాండ్

మనం అనుకుంటాము కానీ....ప్రపంచం మొత్తంలో ఉన్న అందమూ, వింతలూ అంతా మన భారతదేశంలోనే ఉన్నాయి. మనం చూడటం లేదు అంతే. ఇప్పుడు మీకు చెప్పబోయే అద్భుతం అలాంటిదే మరి. ఉత్తర ఐర్లాండ్‌లోని జెయింట్ కాజ్‌వేని ఎప్పుడైనా చూశారా? ఆ పొడవాటి బసాల్ట్ స్తంభాల లాంటి రాళ్లు అద్భుతంగా ఉంటాయి. సహజసిద్ధమైన ప్రకృతి అద్భుతాలలో చూడవలసిన వాటిల్లో ఇవీ ఒకటి. మన భారతదేశంలోనూ అలాంటివి ఉన్నాయి.

Tourist place:విదేశీయులు మెచ్చే భారత్..అద్భుతాలకు నెలవు కోకోనట్ ఐలాండ్
New Update

కర్నాటకలోని ఉడిపిలో మాల్పే తీరంలో నాలుగు చిన్న దీవుల సముదాయం ఉంది. దాన్ని సెయింట్ మేరీస్ ఐలాండ్స్ అంటారు. అక్కడే మనం చెప్పుకున్న స్తంభాల లాంటి రాళ్ళను చూడవచ్చును. అక్కడ ఉండే నాలుగు ద్వీపాల పేర్లు కోకనట్ ఐలాండ్స్, నార్త్ ఐలాండ్స్, దర్యాబహదూర్‌గర్ ఐలాండ్స్, సౌత్ ఐలాండ్స్. అయితే, ఈ అందమైన బసాల్ట్ రాళ్ళు కేవలం కోకనట్ ఐలాండ్స్‌లో మాత్రమే ఉంటాయి. ఇలాంటి షట్కోణ ఆకారంలో ఉండే రాళ్లు భారతదేశంలో మరెక్కడా లేవు.

ఈ కోకనట్ ఐలాండ్స్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆ దీవిలో పెరిగే కొబ్బరి చెట్లే కారణం. సుమారు 500 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు గల ఈ చిన్న ద్వీపం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడుండే కొబ్బరి చెట్లు, అందమైన రాతి నిర్మాణాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. దీంతో ఇది తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా ప్రత్యేకత సాధించింది.

Also Read:కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

వేల ఏళ్ల క్రితం భూమి ఉపరితలం నుండి వేడిగా పైకి ఎగజిమ్మిన లావా అరేబియా సముద్ర జలాల ద్వారా చల్లబడినప్పుడు ఈ అందమైన రాతి నిర్మాణాలు షట్కోణ ఆకారంలో ఏర్పడ్డాయి. అలాగే ఈ బసాల్టిక్ రాళ్ళ కారణంగా పర్యాటకులు అక్కడ ఈత కొట్టడం కూడా కుదరదు. కానీ, పశ్చిమ దిక్కున ఉన్న అందమైన ప్రాంతంలో రంగురంగుల సముద్రపు గవ్వలు కనిపిస్తాయి.ఈ దీవులకు వెళ్ళాలంటే పడవల ద్వారానే వెళ్ళాలి. ఉడిపి నుండి 6 కి.మీ దూరంలో మాల్పే బీచ్‌ ఉంటుంది. అక్కడి నుండి ప్రతి 20 నిమిషాలకు బోట్ల సౌకర్యం ఉంటుంది. ఈ దీవుల్లో మనుషులు ఎవరూ నివాసం ఉండరు. కాబట్టి అక్కడ స్టే చేయడం కుదరదు. వెళ్ళి చూసి వచ్చేయడమే.

ఈ అరుదైన బసాల్ట్ రాతి నిర్మాణాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా గుర్తించింది. ఈ దీవులను 34 జాతీయ భౌగోళిక అరుదైన నిర్మాణాల్లో ఒకటిగా పేర్కొంది. దీంతో ఈ సెయింట్ మేరిస్ దీవులు కచ్చితంగా చూడాల్సిన గొప్ప ప్రదేశాల్లో ఒకటిగా మారింది. కాబట్టి మీ చెక్ లిస్ట్ లో దీన్ని కూడా చేర్చేసుకోండి. ఈ అరుదైన, అద్భుతమైన దీవులను మీరు కూడా చూసి వచ్చేయండి.

#karnataka #coconut-island #tourist-place #india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి