Child Health: మీ పిల్లలు పదేపదే ఫోన్‌ చూస్తున్నారా? సైంటిస్టుల షాకింగ్‌ ప్రకటన..!

రోజుకు 4 గంటల కంటే ఎక్కువగా ఫోన్‌ యూజ్‌ చేసే పిల్లలు ఆటిజం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు మందబుద్ధికి గురయ్యే ప్రమాదం ఉందని తేలింది. మొత్తం 437 మంది పిల్లల డీఎన్‌ఏపై ఈ రీసెర్చ్ జరిగింది.

New Update
Child Health: మీ పిల్లలు పదేపదే ఫోన్‌ చూస్తున్నారా? సైంటిస్టుల షాకింగ్‌ ప్రకటన..!

ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా ఫోన్‌ పట్టుకొనే కనిపిస్తున్నారు. కరోనా తర్వాత స్మార్ట్ ఫోన్ వినియోగం మరింత పెరిగింది. ఏదో ఒక కారణంతో ఫోన్‌తో పని పడుతోంది. అయితే చాలామంది పిల్లలు వర్క్‌ లేని టైమ్‌లో కూడా అదే పనిగా ఫోన్‌ చూస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అటు కొంతమంది తల్లిదండ్రులు సైతం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందులో కొంతమంది పేరెంట్స్‌ తమ పిల్లల స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నారు కూడా.. 'మా అబ్బాయి LKG లోనే స్మార్ట్ ఫోన్‌ ఆపరేట్ చేస్తున్నాడు' అని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారికి షాకింగ్‌ న్యూస్‌. మీ పిల్లల స్మార్ట్‌ ఫోన్‌ యూసేజ్‌ని పరిమితం చేయకపోతే వాళ్లు ప్రమాదంలో పడినట్లే లెక్క. ఇది పరిశోధకులు చెబుతున్న మాట.

ఆటిజం (Autism):
ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలు మందబుద్ధికి గురయ్యే ప్రమాదం ఉన్నట్లు జపాన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మొబైల్‌ అడిక్షన్‌కి ఆటిజంకి లింక్‌ ఉందంటూ చాలా కాలంగా సైంటిస్టులు చెబుతున్నారు. దీనిపై లోతుగా రీసెర్చ్‌ కూడా చేస్తున్నారు. దీన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అని కూడా పిలుస్తారు. చిన్నతనంలో స్క్రీన్‌ టైమ్‌ లిమిట్‌ దాటితే ASDతో పాటు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌(ADHD)కు కూడా గురవుతారని పరిశోధకులు తేల్చారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

పరిశోధన ఎవరు చేశారు?
జపాన్‌లోని నగోయా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నేతృత్వంలోని బృందం ASD, ADHD పిల్లల్లో స్క్రీన్ టైమ్‌ను పరిశోధించింది. స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్, టీవీ, వీడియో గేమ్ లాంటి వాటి ముందు గడిపే వాటిని స్క్రీన్ టైమ్‌ అంటారు. మొత్తం 437 మంది పిల్లల డీఎన్‌ఏ(DNA)లోని 6.5 మిలియన్ల పాలిమార్ఫిజమ్‌లను పరిశీలించారు. పాలిమార్ఫిజమ్‌ అంటే తెలుగులో బహురూపత్వం. అంటే ఎగ్జాంపూల్‌కి ఒక స్టూడెంట్‌ క్లాస్‌ రూమ్‌లో విద్యార్థిలాగా.. ఇంట్లో తల్లికి కొడుకు లాగా, షాప్‌కి వెళ్తే కస్టమర్‌లాగా ఉంటాడు. దీన్నే పాలిమార్ఫిజమ్‌ అంటారు. సంబంధిత ASD పిల్లలు ఏ సమయంలో ఎలా ఉంటున్నారో పరిశోధించారు.

ఏం తేలింది:
ASD బారిన పడ్డ పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్‌ని చూసినట్లుగా పరిశోధకులు గుర్తించారు. రోజుకు నాలుగు గంటలకు పైగా స్క్రీన్‌ చూసే పిల్లల్లో ASD వచ్చే ఛాన్స్‌ 2 రెట్లు ఎక్కువగా తేలింది. ఈ ఫలితాలను సైకియాట్రీ రీసెర్చ్ జర్నల్లో ప్రచురించారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

ఆటిజం లక్షణాలు:

సమాజం: ఆటిజం బారిన పడ్డ వారికి సమాజంతో పెద్దగా పట్టింపు ఉండదు. తమ పని చేసుకుంటూ పోతారు. సమాజంలో జరిగే వాటి గురించి అసలు పట్టించుకోరు. స్పందనలు, ప్రతిస్పందనలు ఉండవు.

కమ్యూనికేషన్: అవతలి వ్యక్తులు చెప్పే విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం వీరిలో తక్కువగా ఉంటుంది. ఇతరులతో సరిగ్గా కమ్యూనికేట్ చేయరు. ఎక్కడైనా ఏమైనా మాట్లాడాల్సి వస్తే భయపడతారు. ఇక రియాక్షన్ టైమ్‌ కూడా చాలా లేట్‌గా ఉంటుంది

నిత్యం అదే పని: వారంలో ప్రతీ రోజూ ఒకే లాగా గడపడం ఎవరికైనా చికాకుగానే ఉంటుంది. అయితే ఆటిజంతో బాధ పడేవారు ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. ముఖ్యంగా వస్తువులకు ఇంపార్టెన్స్‌ ఇస్తుంటారు. ఫోన్‌ కూడా వస్తువే కదా!

సెన్సిటివిటీస్‌: ధ్వని, కాంతి, స్పర్శ, రుచి లాంటి వాటి విషయంలో ఆటిజం బాధితులు సున్నితత్వాన్ని కోల్పోతారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

అయితే ఆటిజంతో బాధపడుతున్న ప్రతీ వ్యక్తి ఇలానే ఉంటాడని కాదు. ఈ లక్షణాలు ఒకరికి మరొకరికి వేరువేరుగా ఉంటాయి. ఏది ఏమైనా ఫోన్‌ వ్యసనం అన్నది అసలు మంచిది కాదు.. ఎంతవరకు యూజ్ చేయాలో అంతే వాడాలి. లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. జపాన్‌ పరిశోధకులు చెబుతున్నది కూడా అదే! ముఖ్యంగా మొబైల్‌, వీడియో గేమింగ్‌ అన్నది చాలా ప్రమాదాలను తీసుకొస్తుంది.

Also Read: కంటి చూపు మెరుగవ్వాలంటే.. ఈ ఫుడ్స్ మీ డైట్లో ఉండాల్సిందే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు