author image

Trinath

By Trinath

బీజేపీ తమిళనాడు పై ఫోకస్ పెంచినట్టుగా అర్థమవుతోంది. ఆరు నెలలుగా తమిళనాడు కేంద్రంగా అనేక రాజకీయ కార్యక్రమాలను చేపడుతోంది. లోకల్‌గా ఉన్న లీడర్లతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్‌ అన్నామలై చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది.

By Trinath

Amit Shah : ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ని అమలు చేస్తామన్నారు అమిత్‌ షా. ఉత్తరాఖండ్‌ తరహాలోనే దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఒకే విధమైన పౌర చట్టాన్ని తీసుకురావాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 44 చెబుతుందన్నారు అమిత్‌షా.

By Trinath

BJP Padayatra : మోదీ తమిళనాడు పర్యటన సందర్భంగా సందర్భంగా తమిళనాడు బీజేపీ నేత కె.అన్నామలై సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఎన్.మక్కల్ పాదయాత్ర విజయవంతంగా ముగిసిందన్న అన్నామలై మోదీపై ప్రశంసలు కురిపించారు. తన జీవితంలో అత్యుత్తమ అనుభవం ఈ పాదయాత్ర అని చెప్పారు.

By Trinath

Road Accident : ఆఫ్రికా దేశం మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 31 మంది మరణించారు. వంతెనపై నుంచి బస్సు నదిలో పడిపోయింది. ఈ బస్సు బుర్కినా ఫాసో వెళుతోంది. అకస్మాత్తుగా బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడిందని అధికారులు చెబుతున్నారు.

By Trinath

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అంబాజీపేటలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాభాస జరిగింది. మహాసేన రాజేష్‌కు టికెట్ కేటాయించడంపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. మహాసేన రాజేశ్‌ కారును ధ్వంసం చేశారు కార్యకర్తలు.

By Trinath

CUET-PG షెడ్యూల్‌ను NTA రిలీజ్ చేసింది. మే 15 నుంచి 31 వరకు ప్రతిరోజు రెండు, మూడు షిఫ్టుల్లో హైబ్రిడ్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఈ సారి తెలుగుతో సహా 13 భాషల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు గరిష్టంగా ఆరు సబ్జెక్టులను ఎంచుకోవడానికి అనుమతించారు.

By Trinath

పీఎం కిసాన్‌ 16వ విడద నిధులు ఈ నెల 28న కేంద్రం రైతుల ఖాతాలో బదిలి చేయనుంది. పీఎం కిసాన్‌ యోజన కింద రైతులకు ఏటా రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల ఖాతాలో జమ చేస్తారు. 16వ విడతలో రూ.2000ని రైతులకు అందిస్తారు.

By Trinath

ఆంధ్ర జట్టులోకి విహారి రావడం, పోవడంవల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్‌ దృష్టికి తీసుకువచ్చారంటూ విహారిపై ఏసీఏ ఫైర్ అయ్యింది. దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

తెలంగాణలో ఇవాళ్టి నుంచి అంటే ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1, 521 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతి ఉండదు.

By Trinath

ఇవాళ నేషనల్ సైన్స్ డే. 1928లో ఫిబ్రవరి 28న సీవీ రామన్ 'రామన్ ఎఫెక్ట్‌'ను కనుగొన్నట్లు ప్రకటించారు. ఈ ఆవిష్కరణకు 1930లో సైన్స్‌లో రామన్‌కు నోబెల్ బహుమతి లభించింది. నేటికీ రసాయనాల పరమాణు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి రామన్ ఎఫెక్ట్ ఒక ముఖ్యమైన సాధనం.

Advertisment
తాజా కథనాలు