బెంగళూరు నగరాన్ని చూసేందుకు ఓ వ్యక్తి ఉబర్ డ్రైవర్‌గా మారాడు. హైదరాబాద్‌లో గూగుల్ ఉద్యోగికి పని చేసిన అతను.. 20 రోజుల క్రితం బెంగళూరు వెళ్లాడు. నగరాన్ని మొత్తం చూడాలని డిసైడ్ అయిన అతను ఉబర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వి్ట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది.
Trinath
ఈ దసరా విన్నర్‌గా నందమూరి బాలకృష్ణ నిలిచాడు. బాలయ్యబాబు నటించిన భగవంత్ కేసరి బాక్స్‌ఆఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 55 కోట్ల షేర్.. 104 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ఆరు రోజుల్లోనే వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసింది.
వరల్డ్‌కప్‌లో మరో రికార్డు నమోదైంది. ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీని రికార్డు చేశాడు ఆసీస్ స్టార్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్. ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాప్రికా స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ 49 బంతుల్లో సెంచరీ చేయగా.. ఇప్పుడా రికార్డును మాక్సీ లేపేశాడు.
ఈ మధ్య కాలంలో పెట్రోల్ బాంబులు విసిరే వారి సంఖ్య పెరుగుతోంది. కొంతమంది ఆకతాయితనంగా, మరి కొంతమంది పగలు, ప్రతీకారల పేరుతో పెట్రోల్ బాంబులు వినియోగిస్తున్నారు. తమిళనాడు రాజ్‌భవన్‌పై పెట్రోల్ బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది. బాంబులు విసిరిన వ్యక్తిని వినోద్‌గా గుర్తించారు. ఈ దాడి వెనుక అధికార డీఎంకే ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.
జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అంటే పూల పానుపు కాదని.. ఒత్తిడిని తట్టుకుంటూ జట్టును మందుండి నడిపించాలంటున్నాడు పాక్ లెజెండరీ ప్లేయర్ షాహీద్ అఫ్రిది. అఫ్ఘాన్ చేతిలో పాక్ ఓటమికి కెప్టెన్ బాబర్ అజామ్‌ని బాధ్యుడిని చేస్తూ ఆ జట్టు మాజీ ప్లేయర్లు మండిపడుతున్నారు. బాబర్ అజామ్‌ని తప్పించాలన్న డిమాండ్ కూడా మరోవైపు నుంచి గట్టిగా వినిపిస్తోంది.
వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో ఇరగదీస్తున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్ ఇది. అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ పాండ్యా అందుబాటులో ఉండడంలేదు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డ సంగతి తెలిసిందే. అతను గ్రౌండ్‌లో దిగడానికి మరింత సమయం పడుతుందని సమాచారం.
నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) నిధుల వినియోగంలో హైదరాబాద్ జిల్లాలో MIM నేతలు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ మౌజంఖాన్ ఫస్ట్ 3 స్థానాల్లో ఉండగా.. చివరి స్థానంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్(బీఆర్‌ఎస్) ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 నియోజవర్గాలున్నాయి.
ఇటీవల కాలంలో దేశం పేరు మార్పు అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. NCERT తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. పాఠ్యపుస్తకాల్లో ఇకపై 'ఇండియా' అనే పేరు ఉండదు. Indiaకి బదులుగా 'భారత్' పేరును ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రింట్ కానున్న NCERT బుక్స్‌లో ఇండియా ప్లేస్‌లో భారత్ పేరు ఉండనుంది.
వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ మృతిలో ఊహించని ట్విస్ట్ నెలకొంది. కుక్కల దాడిలో ఆయన మెదడుకు దెబ్బతగిలినట్టు.. చివరికి మెదడు సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతు ప్రాణాలు విడిచారన్న వార్తలపై షాల్బీ ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. ఆయన శరీరంపై కుక్క కాటుకు సంబంధించి ఎలాంటి గుర్తులు లేవని చెప్పారు. పరాగ్ కిందపడిపోయిన తర్వాత కుటుంబసభ్యులు ముందుగా షాల్బీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. తర్వాత అక్కడ నుంచి జైడస్ ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల కోసం ఎన్నో చేసిన పరాగ్.. వాటిని చూసి భయపడే వ్యక్తి కాదని జంతు హక్కుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/australian-team-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/uber-driver-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ballaya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/maxwell-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/petrol-bomb-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cricket-fans-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/indian-team-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/charminar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ncert-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/parag-desai-jpg.webp)