Petrol Bomb: గవర్నర్‌ అధికారిక నివాసంపై పెట్రోల్ బాంబులు.. ఇది ఎవరి పని?

ఈ మధ్య కాలంలో పెట్రోల్‌ బాంబులు విసిరే వారి సంఖ్య పెరుగుతోంది. కొంతమంది ఆకతాయితనంగా, మరి కొంతమంది పగలు, ప్రతీకారాల పేరుతో పెట్రోల్ బాంబులు వినియోగిస్తున్నారు. తమిళనాడు రాజ్‌భవన్‌పై పెట్రోల్‌ బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది. బాంబులు విసిరిన వ్యక్తిని వినోద్‌గా గుర్తించారు. ఈ దాడి వెనుక అధికార డీఎంకే ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.

New Update
Petrol Bomb: గవర్నర్‌ అధికారిక నివాసంపై పెట్రోల్ బాంబులు.. ఇది ఎవరి పని?

తమిళనాడు(Tamilnadu)లోనూ సర్కార్‌ వర్సెస్‌ గవర్నర్‌ వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్‌ ప్రభుత్వం అసెంబ్లీ పాస్‌ చేసుకున్న బిల్లులకు ఆమోదం తెలపకుండా తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) జాప్యం చేస్తున్నారంటూ కొంతకాలంగా డీఎంకే ఆరోపిస్తోంది. ఇదే సమయంలో గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్‌ వద్ద ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. ఏకంగా రాజ్‌భవన్‌పైనే రెండు పెట్రోల్ బాంబులు విసిరాడు. మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో వినోద్ అనే వ్యక్తి రాజ్‌భవన్ ప్రధాన గేటు వద్ద పెట్రోల్ ఉన్న రెండు కంటైనర్లను విసిరాడు.

publive-image RN రవి(లెఫ్ట్), తమిళనాడు రాజ్ భవన్(రైట్)

పెట్రోల్ బాంబులు ఎక్కడవి?
అసలు వినోద్‌కి ఆ పెట్రోల్ బాంబులు ఎక్కడవి అన్న ప్రశ్నపై పోలీసులు సమాధానం చెప్పారు. రాజ్‌భవన్‌కు సమీపంలోని ఓ పార్కింగ్‌ ప్లేస్‌ వద్ద బైక్‌ నుంచి రెండు పెట్రోల్‌ బాటిల్స్‌ను వినోద్‌ చోరీ చేశాడని చెబుతున్నారు. వాటిని పట్టుకోని నేరుగా రాజ్‌భవన్‌ వద్దకు వెళ్లాడని.. అక్కడ వాటిని మంటపెట్టి విసిరాడంటున్నారు. 'సైదాపేట కోర్టు ఆవరణలో పార్క్ చేసిన బైకుల నుంచి పెట్రోల్ చోరీ చేసి, తర్వాత రాజ్‌భవన్‌ వైపు వెళ్లి రెండు బాటిళ్లపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి.. మెయిన్‌ గేటు వద్ద విసిరాడు' అని పోలీసులు స్టేట్‌మెంట్ ఇచ్చారు.


బీజేపీ ఆఫీస్‌పైనా దాడి:
మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ మండిపడుతోంది. వినోద్‌ ఇలా చేయడం వెనుక అధికార డీఎంకే ఉందని తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలై ఆరోపిస్తున్నారు. గతంలో బీజేపీ ఆఫీస్‌పై దాడి చేసింది కూడా ఇదే వినోద్‌ అని.. డీఎంకే ఇలా చేయిస్తుందని చెబుతున్నారు. ఇక అంతటితో ఆగలేదు అన్నామలై. ట్విట్టర్‌లో ఈ విధంగా పోస్టు చేశారు. 'ఈరోజు రాజ్‌భవన్‌పై పెట్రోలు బాంబులు విసిరారు, ఇది తమిళనాడులోని శాంతిభద్రతలను ప్రతిబింబిస్తుంది. డీఎంకే ప్రజల దృష్టిని మళ్లించడంలో బిజీగా ఉంది. నేరస్థులు వీధుల్లోకి వచ్చారు. అదే వ్యక్తి(వినోద్‌) 2022 ఫిబ్రవరిలో చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశాడు. ఈరోజు రాజ్‌భవన్‌పై జరిగిన దాడికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది' అని అన్నామలై ట్వీట్ చేశారు. మరోవైపు అన్నామలై ఆరోపణలపై డీఎంకే మండిపడుతోంది. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శిస్తోంది.

Also Read: టీమిండియాకు బిగ్‌ షాక్‌.. తర్వాతి రెండు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్‌ దూరం!

Advertisment
Advertisment
తాజా కథనాలు