author image

Trinath

AP Crime News:  కృష్ణారెడ్డి హత్యకు రాజకీయ రంగు.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య యుద్ధం!
ByTrinath

పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డి దారుణహత్య రాజకీయ రంగు పులుముకుంది. గురజాల మండలం జంగమహేశ్వరపాడులో కృష్ణారెడ్డి హత్యకు గురికావడం అక్కడి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ కేసులో మాజీ శాసనసభ్యులు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఎమ్మెల్యే కాసు మహేశ్‌ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇక వ్యక్తిగత కక్షలు, ఇతర ఎఫైర్స్‌తో కృష్ణారెడ్డి హత్య జరిగితే రాజకీయ రంగు పులమాలని చూస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు.

TS elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందా?
ByTrinath

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. బాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. మరోవైపు బీజేపీతో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

Sachin Tendulkar: బ్యాటే ఆయుధం.. ఆటే ప్రాణం.. దసరా వేళ సచిన్‌ మార్క్‌ 'ఆయుధ పూజ' ఇది!
ByTrinath

క్రికెట్‌ను ప్రాణంగా భావించే సచిన్‌.. ఆట పట్ల తనకున్న ప్రేమను మరోసారి చూపించాడు. దసర సందర్భంగా ఆయుధ పూజ వేళ.. 'బ్యాట్‌-బాల్‌' ని దేవత ముందు పెట్టి పూజ చేశాడు సచిన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 'బంతి బౌండరీ దాటినట్లే, చెడుపై మంచి సాధించిన విజయం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.. సరైన మార్గం కోసం బ్యాటింగ్ చేస్తూ ఉండండి' అని అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు క్రికెట్ గాడ్.

Israel vs Hamas: నొప్పితో విలవలలాడిపోయాను.. 85 ఏళ్ల భామ్మ ఏం చెప్పిందంటే?
ByTrinath

ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య జరుగుతున్న భీకర పోరులో అమాయకులు బలైపోతున్నారు. 400మందికి పైగా ఇజ్రాయెలీ పౌరులను గాజాలని సొరంగాల్లో హమాస్‌ బంధించిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరిని తాజాగా హమాస్‌ విడుదల చేసింది. అందులో 85ఏళ్ల అసలేం జరిగిందో వివరించింది. సొరంగాల్లో బందీగా ఉన్నప్పుడు ఓ డాక్టర్‌ తనకు వైద్య పరీక్షలు నిర్వహించేవారని చెప్పింది. హమాప్‌ మిలిటెంట్లు తమని మంచిగానే చూసుకున్నారని తెలిపింది.

Ravana: వాళ్లకి రావణుడే దేవుడు.. ఎక్కడో తెలుసా..?
ByTrinath

రావణ దహనం ఆదివాసీల మనోభావాలను దెబ్బతీయడమేనంటున్నారు మ‌హారాష్ట్ర గ‌డ్చిరోలి జిల్లాలోని కోడిశలగూడెం ఆదివాసీలు. రావణుడు గొప్ప శివభక్తుడని, వేదలను అధ్యయనం చేసిన గొప్ప విద్యావేత్త అని అంటున్నారు. రావణబ్రహ్మని తాము కొలుస్తామని చెబుతున్నారు. దసరా పర్వదినాల్లో 11 రోజుల పాటు కఠోర ఉపావాస దీక్ష చేసి రావణాసురిడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వీరి ఆనవాయితీ కూడా.

World Cup: భారీ శరీరంతో మీ మామయ్య ప్రత్యర్థులను ఉతికి ఆరేశాడు.. మీకేమో తిండిగోలా..ఉఫ్‌!
ByTrinath

ఈ వరల్డ్‌కప్‌లో పాక్‌ జట్టు ఆట మ్యాచ్‌ మ్యాచ్‌కు మరింత తీసికట్టుగా మారుతోంది. పసికూన అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లోనూ పాక్‌ ఓడిపోయింది. ఇదే సమయంలో పాక్‌ ఓపెనర్‌ ఇమామ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై నెట్టింట్లో సెటైర్లు పేలుతున్నాయి. సిక్సులు కొట్టడానికి మరింత ప్రొటీన్‌ అవసరం అని.. పిండిపదార్థాలు కాదంటూ వ్యాఖ్యలు చేశాడు ఇమామ్‌. అయితే అతనికి క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎలా కౌంటర్లు వేశారో ఈ ఆర్టికల్ చూసి తెలుసుకోండి.

Harish Rao: 'ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తే పని అయ్యేది'.. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్!
ByTrinath

ధరణి వద్దు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థ తెస్తారా అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు మంత్రి హరీశ్‌రావు. కర్ణాటక రైతులు అక్కడి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారన్నారు. ఉద్యమకారులుపై తుపాకీ పట్టిన వ్యక్తులు ఇప్పుడు రాష్ట్రం కోసం ఎగబడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీశ్‌రావు. రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలంగాణ పాల పిట్ట కేసీఆర్ అంటూ కొనియాడారు హరీశ్‌రావు.

World cup 2023: ఆడడానికి వచ్చారా.. మెక్కడానికి వచ్చారా? ఏకంగా 8 కేజీల మటన్‌ తింటారా?
ByTrinath

అఫ్ఘాన్‌పై ఓటమిని తట్టుకోలేకపోతున్నారు పాక్‌ మాజీ ఆటగాళ్లు. తమ జట్టు ప్లేయర్ల ఫిట్‌నెస్‌ ఏ మాత్రం బాలేదని పాకిస్థాన్‌ లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్‌ విమర్శించాడు. పాక్‌ ఆటగాళ్ల ఫీల్డింగ్‌ స్కిల్స్‌ చూస్తుంటే రోజుకు 8 కేజీల మటన్‌ తింటున్నట్టు ఉందంటూ కామెంట్స్‌ చేశారు. వారి ఫిట్‌నెస్ లెవల్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు. అసలు ఫిట్‌నెస్‌ టెస్ట్ ఎందుకు జరపడంలేదో తనకు అర్థంకావడం లేదన్నాడు వసీం.

Dussehra 2023: దుర్గా మాత నుంచి ఇవి నేర్చుకుంటే మీకు లైఫ్‌లో అన్నీ విజయాలే!
ByTrinath

దుర్గాదేవి కథల నుంచి మీ పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. ఆమె బలం, ధైర్యం, అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని గురించి మీ పిల్లలకు వివరించండి. Dussehra 2023

Advertisment
తాజా కథనాలు