TS elections 2023: హైదరాబాద్‌లో ఫస్ట్ ఎవరు.. లాస్ట్ ఎవరు? అభివృద్ధికి ఏ ఎమ్మెల్యే ఎంత ఖర్చు చేశారంటే? నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) నిధుల వినియోగంలో హైదరాబాద్ జిల్లాలో MIM నేతలు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ మౌజంఖాన్ ఫస్ట్ 3 స్థానాల్లో ఉండగా.. చివరి స్థానంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్(బీఆర్‌ఎస్) ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 నియోజవర్గాలున్నాయి. By Trinath 25 Oct 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) కింద ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ నిధులను ఎమ్మెల్యేలు ఎలా వినియోగంచుకుంటున్నరాన్న దానిపై ఆ నియోజకవర్గ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎమ్మెల్యేల స్టైల్ డిఫరెంట్‌గ ఉంటుంది. బయటకు ఎలాంటి పబ్లిసిటీలు చేసుకోకున్నా.. తమ పని మాత్రం సైలెంట్‌గా చేసుకుంటు పోతుంటారు. మరికొందరు ఎమ్మెల్యేలు పైకి అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని చెబుతారు కానీ.. రియాల్టీలో నియోజకవర్గంలో ఎలాంటి మార్పూ కనపడదు. ఇంకొంతమంది చెప్పిందే చేస్తారు.. చేసేదే చెబుతారు.. ఇలాంటి వారు కాస్త అరుదు. తెలంగాణలో వచ్చే నెల(నవంబర్ 30)న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయి. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేల పనతీరు ఎలా ఉందన్నదానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటు హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యేలపై ఓ లుక్కేయండి. Also Read: సంచలన నిర్ణయం.. ఇకపై బుక్స్‌లో ‘ఇండియా’ పేరు ఉండదు..! రూ.3 కోట్ల నిధులు: హైదరాబాద్ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. సీడీపీ నీధులు జనాభా ప్రాతిపాదికన కేటాయిస్తున్నారు. యావరేజ్‌గా ఒక్కొ నియోజకవర్గానికి 2.5 నుంచి 3 కోట్లు కేటాయించారు. 2014లో ఈ నంబర్ ఒక కోటిగా ఉండేది.. తర్వాత పెరుగుతూ వచ్చింది. గతేడాది మూడు కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఎమ్మెల్యేకు 5 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. అంఉదలో రెండు కోట్లు స్కూల్ ఎడ్యూకేషన్ డిపార్టమెంట్‌కి వెళ్లిపోతుంది. అంటే రూ.3కోట్లు ఉన్నట్టు లెక్క. 2018 నుంచి ఈ ఐదేళ్లలో ఏ ఎమ్మెల్యే తమ నిధులను ఎలా ఉపయోగించుకున్నారన్న ఆసక్తి ప్రజల్లో కనిపిస్తోంది. అందులో ఎన్నికల సమయం కావడంతో వారికి ఈ లెక్క అవసరం కూడా. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, హైదరాబాద్ పరిధిలో మొత్తం ఎమ్మెల్యేలు 15 మంది ఐదేళ్లలో సీడీపీ కింద ఒక్కో ఎమ్మేల్యేకి వచ్చిన నిధులు - రూ. 9 కోట్లు వేటిపై ఖర్చుపెట్టాలి..? తాగునీరు, ప్రజారోగ్యం, బిల్డింగులు, టాయిలెట్లు, సీసీ కెమెరాలు, సీసీ రోడ్లు, వీధిలైట్లు హైదరాబాద్‌లో ఫస్ట్ ఎవరు.. లాస్ట్ ఎవరు? 1) కార్వాన్ - కౌసర్ మొయినుద్దీన్ (ఎంఐఎం)- రూ.8.98 కోట్లు 2) నాంపల్లి - జాఫర్ హుస్సేన్ మెరాజ్ (ఎంఐఎం) - రూ.8.93 కోట్లు 3) బహదూర్‌పురా - మహ్మద్ మౌజంఖాన్ (ఎంఐఎం) - రూ. 8.61 కోట్లు 4) గోషామహల్ - రాజాసింగ్(బీజేపీ) - రూ.6.93 కోట్లు 5) సికింద్రాబాద్(కంటోన్మెంట్) - జి.సాయన్న (బీఆర్ఎస్) - రూ. 6.44 కోట్లు 6) యాఖుత్‌పురా - అహ్మద్ పాషాఖాద్రీ (ఎంఐఎం) - రూ. 5.96 కోట్లు 7) జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్(బీఆర్‌ఎస్) - రూ. 5.67 కోట్లు 8) చార్మినార్ - ముంతాజ్ అహ్మద్‌ఖాన్ (ఎంఐఎం) - రూ. 5.67 కోట్లు 9) చాంద్రాయణగుట్ట - అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) - రూ. 5.66 కోట్లు 10) మలక్ పేట్ - అహ్మద్ అబ్దుల్లా బలాలా (ఎంఐఎం) - రూ. 5.66 కోట్లు 11) సికింద్రాబాద్ - టి.పద్మారావు (బీఆర్ఎస్) - రూ. 5.32 కోట్లు 12) అంబర్ పేట - కాలేరు వెంకటేశ్ (బీఆర్ఎస్) - రూ. 4.09 కోట్లు 13) సనత్‌నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్ (బీఆర్ఎస్) - రూ. 4.03 కోట్లు 14) ఖైరతాబాద్ - దానం నాగేందర్ (బీఆర్ఎస్) - రూ. 3.18 కోట్లు 15) ముషీరాబాద్ - ముఠా గోపాల్ (బీఆర్ఎస్) - రూ. 2.95 కోట్లు లిస్ట్‌ని గమనిస్తే తొలి మూడు స్థానాల్లో MIM నేతలు ఉన్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ రూ.8.98 కోట్లతో అందరి కంటే ముందు ఉండగా.. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ - రూ.8.93 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 12వ స్థానంలో ఉన్నారు. Also Read: బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి డీకే అరుణ, విజయశాంతి? #telangana-elections-2023 #cdp-funds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి