వరదల్లో చిక్కుకున్న వాళ్లని కాపాడిన ఆర్టీవీ టీమ్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షబీభత్సం కొనసాగుతోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగడంతో నగరమంతా నీటితో నిండిపోయింది. నగర వ్యాప్తంగా వందకు పైగా కాలనీలు వరద నీటితో ముంపునకు గురి అయ్యాయి. ఫైర్ డిప్మార్ట్‌మెంట్‌కు చెందిన సిబ్బంది ప్రాణాలకు తెగించి మరి ప్రజలను కాపాడుతున్నారు.

New Update
వరదల్లో చిక్కుకున్న వాళ్లని కాపాడిన ఆర్టీవీ టీమ్

ఆర్టీవీ టీమ్ చొరవతో.. 

భారీ వర్షాలతో వరంగల్ నగరం అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగడంతో నగరమంతా వరద ముంచెత్తింది. పలు కాలనీలు నీటితో నిండిపోయాయి. దీంతో అక్కడ ఇరుకున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆహారం అందక కరెంట్ లేక బయటకు వచ్చే మార్గం లేక బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ఉన్న ఓమేగా క్యాన్సర్ ఆసుపత్రి, శ్రీ గాయత్రి లేడిస్‌ హాస్టల్‌లో ఇరుక్కుపోయిన వందల మంది ప్రాణాలను ఆర్టీవీ టీమ్ కాపాడింది. సమాచారం అందగానే నగర కమిషనర్‌, కలెక్టర్‌ను సంప్రదించింది. దీంతో వారు వెంటనే ఫైర్ సిబ్బందిని అలర్ట్ చేశారు.

మనుషులను కాపాడటమే తమ పని..

ఫైర్ కమిషనర్ వెంకన్న ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెండు రోజులుగా ఎంతో మందిని కాపాడిన వారు ఈ ఆపరేషన్‌కు దిగారు. వరంగల్ కలెక్టర్, హనుమకొండ కలెక్టర్ హైదరాబాద్ నుంచి రెండు బోట్లు, కరీంనగర్ నుంచి ఓ బోటు తీసుకువచ్చారు. అర్థరాత్రి పూట ములుగు రోడ్డులో ఉన్న శ్రీగాయత్రి హాస్టల్‌లో వందల మంది అమ్మాయిలు చిక్కుకుపోయారు. అలాగే ఓమేగా క్యాన్సర్ ఆసుపత్రిలో 29-30 మంది పేషెంట్లు, 30 మంది సిబ్బంది ఉన్నారు. సుమారు 10మందిని ఒక్క ట్రిపులో తీసుకువచ్చారు. పేషెంట్స్‌కు కావాల్సిన ఆహారం, మందులు అందజేశారు. మనుషులను కాపాడటమే తమ పని అని.. ఎంత ఇబ్బంది ఎదురైనా ముందుకు వెళ్తామన్నారు. పాములు, తోళ్లు ఎలాంటివి ఉన్నా పట్టించుకోమన్నారు.

ఆర్టీవీ టీమ్‌కి కృతజ్ఞతలు..

ప్రాణాలు తెగించి మరి మమ్మల్ని కాపాడిన ఫైర్‌ సిబ్బందికి హస్టల్ అమ్మాయిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉదయం నుంచి భారీ వర్షం పడటంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందని.. ఆహారం లేక తాగడానికి నీరు లేక ఇబ్బందిపడ్డామన్నారు. అసలు బయటకు వస్తామో? రామో? అని భయపడ్డామని.. చాలా భయమేసిందన్నారు. ఫైర్ సిబ్బంది వచ్చి రక్షించడంతో ధైర్యం వచ్చిందన్నారు. చలికి వరద నీటితో పాటు చలితో నరకం చూశామని.. వరద నీటితో కొట్టుకుపోతాం అనుకున్నామని భావోద్వేగానికి గురయ్యారు. మమ్మల్ని రక్షించిన సిబ్బందితో పాటు ఆర్టీవీ టీమ్‌కి కృతజ్ఞతలు చెప్పారు. క్యాన్సర్ ఆసుపత్రిలో సిబ్బందిని తీసుకువచ్చామని.. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం దృష్ట్యా పేషెంట్స్‌ను హాస్పిటల్‌లోనే ఉంచామన్నారు. అవసరమైతే వారిని కూడా తీసుకువస్తామని ఫైర్ కమిషనర్ వెంకన్న వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు