బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట దక్కింది. ఈడీపై దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది. విచారణ కోసం మహిళలను ఈడీ కార్యాలయానికి పిలవొచ్చా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.

BalaMurali Krishna
ఉమ్మడి వరంగల్ జిల్లా చిగురుటాకుల వణికిపోతుంది. వరుణుడు ఉగ్రరూపానికి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. హన్మకొండ జిల్లాలో అయితే పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. వరద ధాటికి 17మంది గల్లంతయ్యారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అక్కున చేర్చుకుంది. ఇప్పటికే ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరి చురుగ్గా పనిచేస్తున్నారు. తాజాగా శ్రీధర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది.
విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కోడికత్తి కేసులో మరింత లోతుగా దర్యాప్తుచేయాలని జగన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను ఆగస్టు ఒకటి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం, గురువారం రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన విండీస్ జట్టు వన్డే సిరీస్ కోసం సిద్ధం అవుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధాటిగా ఆడే విండీస్ ప్లేయర్లు రోహిత్ సేనకు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌కు పవర్ హిట్టర్లను జట్టులోకి తీసుకువచ్చారు.
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం సంభవించింది. మేళ్లచెరువులోని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై మైహోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు జోరువానలోనూ బ్లాస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికగా ప్రీరిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యాన్స్ ఈ వేడుకకు భారీగా హాజరయ్యారు. తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వాన కూడా లెక్కచేయకుండా తరలివచ్చారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి స్పీడ్ పెంచారు. వివిధ జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని అనుబంధ సంఘాల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాలంటీవర్ల వ్యవస్థ చుట్టూనే తిరుగున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రెండో దశలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలతో పాటు వాలంటీర్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా పవన్‌పై పరువునష్టం కేసు కూడా దాఖలుచేశారు.
Advertisment
తాజా కథనాలు