author image

B Aravind

Paper Leak: ఇంటర్ పరీక్ష పేపర్ లీక్.. ఎక్కడంటే
ByB Aravind

Inter Paper Leak in UP: ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పేపర్‌ లీక్‌ కాగా.. తాజాగా ఇంటర్‌ బోర్టుకు చెందిన మ్యాథ్స్, బయాలజీ పేపర్‌లు లీకయ్యాయి.

PM Modi: భారత్‌ అభివృద్ధి చెందేది అప్పుడే: ప్రధాని మోదీ
ByB Aravind

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని శుక్రవారం నిర్వహించిన ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Crime News: దారుణం.. బాలికను నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం
ByB Aravind

హర్యానాలోని జింద్‌ జిల్లాలో ఓ బాలికను ఓ ఇంట్లో నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలో దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Railway Unions: ఓపీఎస్‌ అమలు చేయకుంటే రైలు సేవలు నిలిపివేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక
ByB Aravind

కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే.. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి.

PM-KISAN: పీఎం కిసాన్‌ పథకంలో కొత్తగా ఎంతమంది లబ్ధిదారులు చేరారంటే..
ByB Aravind

పీఎం కిసాన్‌ సమ్మన్‌ నిధి పథకంలో కొత్తగా 90 లక్షల మంది లబ్ధిదారులు చేరారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో కొత్తగా ఈ లబ్ధిదారులు చేరినట్లు పేర్కొంది.

Gurmeet Ram Rahim: డేరా బాబాకు పెరోల్‌ ఇవ్వడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ByB Aravind

రేప్‌ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు పదేపదే పెరోల్‌ ఇవ్వడంపై పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనుంచి అతనికి పెరోల్‌ ఇవ్వాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరని హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

MEA: రష్యా సైన్యంలో 20-30 మంది భారతీయులు చిక్కుకుపోయారు: విదేశాంగ శాఖ
ByB Aravind

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. రష్యా కోసం సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. ఇంకా 20 నుంచి 30 మంది భారతీయులు రష్యా సైన్యం వద్ద చిక్కుకుపోయారని పేర్కొన్నారు.

Hyderabad: రూ.65 లక్షల నిధులు మళ్లించిన అధికారిణి అరెస్టు
ByB Aravind

నగర చైల్డ్‌ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారని అనిశెట్టి శ్రీదేవిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. 322 అంగన్‌వాడి కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు