author image

B Aravind

Telangana : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య..
ByB Aravind

Suicide : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని.. ఓ వ్యక్తి మనస్తాపంతో ఉరేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం.. కోలనూర్ గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Telangana : త్వరలో వైద్యారోగ్యశాఖలో పెండింగ్‌ పోస్టుల భర్తీ
ByB Aravind

Health Department : తెలంగాణ లోని వైద్యారోగ్యశాఖలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తులు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇటీవల ఇన్‌ఛార్జ్‌ డీఎంఈగా వాణిదేవి నియాంకంపై హైకోర్టు స్పందించింది.

China: అరుణాచల్‌ప్రదేశ్‌పై మరోసారి నోరు పారేసుకున్న చైనా..
ByB Aravind

అరుణాచల్‌ ప్రదేశ్‌పై చైనా మరోసారి నోరు పారేసుకుంది. 1987లో భారత్‌ ఈ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని ప్రకటించింది. గత నెలరోజుల్లో చైనా ఈ అంశంపై మాట్లాడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

Kangana Ranaut: కంగనా రౌనత్‌ పోటీ చేయడంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

బాలివుడ్‌ నటి కంగనా రౌనత్‌కు బీజేపీ.. ఎంపీ టికెట్‌ ఇవ్వడంతో.. హిమాచల్‌ప్రదేశ్‌ మంత్రి విక్రమాదిత్య సింగ్‌ స్పందించారు. మూడింట ఒకవంతు సమయం కూడా తాను పోటీ చేయనున్న నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని తెలిపారు.

Telangana: పండుగ వేళ విషాదం.. స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
ByB Aravind

మహబూబాబాద్‌ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసం చెరువుకి వెళ్లిన ఓ బాలుడు (10) మృతి చెందాడు. అలాగే కొమురం భీం జిల్లాలో మరో నలుగురు యువకులు హోలీ ఆడిన అనంతరం నదిలో స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందారు.

Schools: ఆ రాష్ట్రంలో 1600 స్కూళ్ల మూసివేత‌..
ByB Aravind

ఉత్తరఖాండ్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ రాష్ట్రంలో 1671 స్కూళ్లు మూసివేసినట్లు అక్కడి విద్యాశాఖ తెలిపింది. అలాగే 3,573 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక తగ్గిపోయిందని.. ఆ పాఠశాలలో పది లేదా అంతకన్న తక్కువ విద్యార్థులు చేరారని పేర్కొంది.

PM Modi: హత్య చేసేందుకు ప్రయత్నించింది మీరు కాదా.. ప్రధాని మోదీపై డీఎంకే మంత్రి విమర్శలు
ByB Aravind

Anitha R Radhakrishnan : డీఎంకే మంత్రి అనితా ఆర్‌ రాధాకృష్ణన్‌.. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ సీఎం కమల్‌ రాజు నిద్రిస్తున్న సమయంలో హత్య చేసేందుకు ప్రయత్నించి మీరు కాదా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది.

Delhi Liquor Case : కేజ్రీవాల్‌ ఎలా ఆదేశాలిచ్చారు.. సీరియస్‌ అయిన ఈడీ
ByB Aravind

Aravind Kejriwal : కస్డడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్‌ ఢిల్లీలో నీటి సమస్యకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారని మంత్రి అతీశీ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈడీ సీరియస్‌ అయ్యింది. ఆయనకు కంప్యూటర్‌ లేదా కాగితాలను ఇవ్వలేదని.. ఈ ఆదేశాలకు ఎలా బయటకి వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది.

Janasena : జనసేనలో మహిళలకు అన్యాయం జరుగుతోంది : పోసపల్లి సరోజా
ByB Aravind

Polasapalli Saroja : కాకినాడ రూరల్‌ అసెంబ్లీ టికెట్‌ తనకు ఇవ్వకపోవడంతో.. జనసేన రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదని.. కాపులకే పెద్ద పీట వేశారని విమర్శించారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు