author image

B Aravind

PM Modi : నేడు తెలంగాణకు రానున్న మోదీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన
ByB Aravind

PM Modi : ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం) తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు ఆదిలాబాద్‌.. అలాగే రేపు సంగారెడ్డికి ప్రధాని వెళ్లనున్నారు. ఈ రెండు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ByB Aravind

Road Accident : వనపర్తి జిల్లా కొత్తపేట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Exercise : వ్యాయామం చేస్తే మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ ప్రయోజనం..
ByB Aravind

Exercise : వ్యాయామం చేస్తే ఎవరికైనా మంచిదే. కానీ ఇది మగవారి కంటే ఆడవారికే ఎక్కువ మేలు చేస్తుందట. చూడటానికి ఇది ఆశ్యర్యంగా అనిపించినా ఇదే నిజం. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇది బయటపడింది.

Israel-Hamas: కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధం.. అమెరిక ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు
ByB Aravind

Israel-Hamas War: హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టేందుకు ఒప్పుకుంటే.. ఆరువారాల పాటు కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

India-China: భారత మీడియాపై చైనా ఆగ్రహం.. కారణం ఏంటంటే
ByB Aravind

ఇటీవల తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ ఇంటర్వ్యూను భారత మీడియా ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన చైనా భారత మీడియా ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేస్తోందని.. తైవాన్ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌ తమలో అంతర్భాగమేనని తెలిపింది.

Telangana : కిడ్నాప్‌ అయిన 9 నెలల చిన్నారి సేఫ్.. నిందితురాలు అరెస్టు..
ByB Aravind

9 Months Old Child Kidnapped : హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో కిడ్నాప్ అయిన పాపను పోలీసులు రక్షించారు. ఆ చిన్నారి ఇంట్లో కేర్‌టేకర్‌గా చేరిన షాజహాన్ అనే మహిళ.. ఆ పాప తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఎత్తుకెళ్లింది. ఎంజీబీఎస్‌లో జహీరాబాద్‌ బస్సు ఎక్కిన ఆమెను పోలీసులు పట్టుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.

Andhra Pradesh: ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన షణ్మఖ్.. కారణం ఇదే
ByB Aravind

విశాఖపట్నంలోని మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన ఫొటోగ్రఫర్ సాయి విజయ్‌(23)ను షణ్ముఖ్ తేజ్(19) హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.15 లక్షల విలువైన కెమెరాల కోసం ఈ హత్య జరిగినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న షణ్ముఖ్‌ను పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

Telangana : ఆ స్థానాల్లో బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థులుగా వినోద్, కొప్పుల ఈశ్వర్
ByB Aravind

BRS Party : మాజీ సీఎం కేసీఆర్‌ఈరోజు మధ్యాహ్నం .. బీఆర్‌ఎస్‌ భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా వినోద్‌ కుమార్‌, పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్‌ల పేర్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం.

Farmers : రైతులకు శుభవార్త.. మరో పదిరోజుల్లో రైతుబంధు పంపిణీ పూర్తి చేసేలా రేవంత్‌ ఆదేశం..
ByB Aravind

Rythu Bandhu : 10 రోజుల్లో రైతుబంధు నిధుల పంపిణీ పూర్తి చేయాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. ఇప్పటివరకు 4 ఎకరాల్లోపు ఉన్నవారికి మాత్రమే రైతుబంధు డబ్బులు రావడంతో అయోమయం నెలకొంది. ఇక ఖరీఫ్‌ నుంచి రైతుభరోసా పథకం అమలు చేయనుంది కాంగ్రెస్‌ సర్కార్.

Finger Prints : అద్భుతం.. క్షణాల్లో వేలిముద్రలను గుర్తించే స్ప్రే..
ByB Aravind

Finger Prints : చైనాలోని షాంఘై నార్మల్‌ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని బాత్‌ యూనివర్సిటీ పరిశోధకులు కొత్తగా ఓ ఫ్లోపిసెంట్‌ స్ప్రేను అభివృద్ధి చేశారు. ఈ స్ర్పే చల్లిన కొన్ని సెకన్లలోనే వేలి ముద్రలు ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల ఫొరెన్సిక్‌ నిపుణుల దర్యాప్తు.. మరింత సులభంగా, వేగంగా జరిగిపోతుంది.

Advertisment
తాజా కథనాలు