పార్ల‌మెంట్ హౌజ్‌లోనే రక్షణ లేదు..!

New Update

మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం మనం చూస్తునే ఉంటాం. కొంతమంది సరదాకి చేస్తే.. మరి కొంతమంది కావాలనే చేస్తుంటారు. ఇలాంటి ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కాదు.. ఏకంగా పార్ల‌మెంట్ హౌజ్‌లోనే ఓ ఎంపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మ‌హిళల ప‌ట్ల శాసనమండలిలో చెడుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మ‌హిళా ఎంపీ ఆరోప‌ణ‌ చేశారు. తోటి సేనేట‌ర్ల వైఖ‌రి సరిగా లేదని ఆస్ట్రేలియా సేనేట‌ర్ లిడియా థోర్ప్ తెలిపారు. పార్ల‌మెంట్‌లో సుర‌క్షితంగా వర్కచేసే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని ఆమె కోరారు.

Australian senator alleges assault in parliament house

ఆస్ట్రేలియాకు చెందిన మ‌హిళా ఎంపీ సేనేట‌ర్ లిడియా థోర్ప్ పార్లమెంట్ హౌస్‌లోని వ్యక్తులపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పార్ల‌మెంట్ హౌజ్‌లోనే ఓ సీనియ‌ర్ సేనేట‌ర్‌ త‌న‌లో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు థోర్స్ చెప్పారు. సుర‌క్షిత‌మైన ప‌ని ప్ర‌దేశం కావాల‌ని ఆమె త‌న ప్ర‌సంగంలో కోరారు. సేనేట‌ర్ థోర్ప్ మాట్లాడుతూ.. తానేమీ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కోర‌డం లేద‌ని, లేదా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం లేద‌ని, ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న ఉన్న వ్య‌క్తి కూడా ఎవ‌రూ లేర‌ని ఆమె కంటతడి పేడుతూ తన బాధను వెల్లబుచ్చారు.

పార్ల‌మెంట్ హౌజ్‌లోనే లైంగిక‌ప‌ర‌మైన వ్యాఖ్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని, కొంద‌రు వ్య‌క్తులు త‌న‌ను అనుచితంగా ట‌చ్ చేసిన‌ట్లు వెల్లడించారు. ఓ సేనేట‌ర్ త‌న‌ను పార్ల‌మెంట్ హౌజ్‌లోనే వెంబ‌డించార‌ని, సాక్ష్యులు.. కెమెరాలు లేని చోట అత‌ను అస‌భ్య‌క‌ర రీతిలో త‌న‌ను తాకిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. లిబ‌రల్ పార్టీ సేనేట‌ర్ డేవిడ్ వాన్ త‌న‌ను వేధించిన‌ట్లు ఆమె ఆరోపించారు. ఇకనైనా పని చేసుకోవాటానికి అనుకూలంగా ఉండే విధంగా చూడాలని ఆమె విజ్ఙప్తి చేశారు. పార్లమెంట్‌లో ఈ రకంగా మహిళలను ఇబ్బందికి గురి చేయటం మంచి మద్దతి కాదని ఆమె మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు